Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (19:01 IST)
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగివున్నారన్న ముగ్గురు ఉద్యోగులపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలడంతో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
తొలగించిన వారిలో పోలీస్ కానిస్టేబుల్ మాలిక్ ఇష్ఫాక్ నసీర్, పాఠశాల ఉపాధ్యాయుడు అజాజ్ అహ్మద్, ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌‍గా పనిచేస్తున్న వసీం అహ్మద్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురూ ఉగ్రవాద సంస్థలకు సరుకులు చేరవేయడం, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడటం, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 
జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉగ్రవాదుల సానుభూతిపరులను గుర్తించి, వారిని ఏరివేసే ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. ఇప్పటివరకు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యవర్గం సుమారు 75 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు గుర్తించి వారిని విధుల నుంచి తొలగించింది. క్షేత్రస్థాయిలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని గుర్తించేందుకు నిరంతర నిఘా కొనసాగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments