Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిప్పు సుల్తాన్ ద్రోహి.. బీజేపీ :: ఆయనో పోరాటయోధుడు... రాష్ట్రపతి

టిప్పు సుల్తాన్ వ్యవహారం ఇపుడు దేశంలో చర్చనీయాంశమైంది. టిప్పు సుల్తాన్‌ను బీజేపీ దేశ ద్రోహిగా అభివర్ణించింది. కానీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాత్రం ఆయనో పోరాట యోధుడు అంటూ అభివర్ణించారు. దీంతో ఈ వివా

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (14:14 IST)
టిప్పు సుల్తాన్ వ్యవహారం ఇపుడు దేశంలో చర్చనీయాంశమైంది. టిప్పు సుల్తాన్‌ను బీజేపీ దేశ ద్రోహిగా అభివర్ణించింది. కానీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాత్రం ఆయనో పోరాట యోధుడు అంటూ అభివర్ణించారు. దీంతో ఈ వివాదం మరింతగా రాజుకున్నట్టయింది. 
 
టిప్పు సుల్తాన్‌ను ద్రోహిగా బీజేపీ అభివర్ణిస్తున్నక్రమంలో రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. బ్రిటిష్‌ వారితో చారిత్రక పోరాటంలో టిప్పు సుల్తాన్‌ అసువులు బాశారని రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు. 
 
కర్ణాటక విధాన సౌథ 60వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ బ్రిటిష్‌ వారితో తలపడుతూ టిప్పు సుల్తాన్‌ వీరోచితంగా మరణించారన్నారు. యుద్ధ రంగంలో మైసూరు రాకెట్ల ప్రయోగంలో ఆయన దిట్టని అన్నారు. 
 
కానీ, బీజేపీ మాత్రం ఆయనను దేశ ద్రోహిగా అభివర్ణించింది. ఫలితంగా ఈ వేడుకల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ వైఖరితో కోవింద్‌ వ్యాఖ్యలు విభేదిస్తుండటంతో ఇది హాట్‌ టాపిక్‌ అయింది. కోవింద్‌ వైఖరితో టిప్పు సుల్తాన్‌ స్వాతంత్ర సమరయోధుడని చెబుతున్న కర్ణాటక సర్కార్‌ వాదనకు బలం చేకూరుతుండటం బీజేపీ నేతలకు రుచించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments