Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి టూరిస్టు స్పాట్లు ఓపెన్

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (08:46 IST)
క‌రోనా లాక్ డౌన్ నిబంధ‌నల స‌డ‌లింపులో భాగంగా నేటి నుంచి ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో మూడు వేల‌కు పైగా ఉన్న ఆర్కియాల‌జీ సర్వే ఆఫ్ ఇండియా ప‌ర్య‌వేక్ష‌ణ‌లోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను తెరిచేందుకు అనుమ‌తిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది.

అయితే టూరిస్టు ప్రాంతాల‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని, సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని సాంస్కృతిక‌ శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ ప‌టేల్ చెప్పారు.

ప‌ర్యాట‌క కేంద్రాల‌ ఎంట్రీ ద‌గ్గ‌ర ప్ర‌తి ఒక్క‌రినీ స్క్రీనింగ్ చేసి.. క‌రోనా ల‌క్ష‌ణాలు లేని వారిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించాల‌ని ఆయ‌న సూచించారు. అలాగే అక్క‌డ శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాల‌న్నారు.
 
*ఏఎస్ఐ టూరిస్టు స్పాట్లు
దేశ వ్యాప్తంగా 3,691 ప్రాచీన క‌ట్ట‌డాలు, ప‌ర్యాట‌క కేంద్రాల‌ను కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఆర్కియాల‌జీ సర్వే ఆఫ్ ఇండియా ప‌రిర‌క్షిస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం మార్చి 17 నుంచి వీట‌న్నిటినీ మూసేశారు. ప్ర‌స్తుతం లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించిన నేప‌థ్యంలో ఈ ప‌ర్యాట‌క కేంద్రాల‌ను మ‌ళ్లీ తెరిచేందుకు కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

ఆర్కియాల‌జీ సర్వే ఆఫ్ ఇండియా ప‌రిధిలో హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ, సెవన్ టూంబ్స్, సాలార్జంగ్ మ్యూజియం లాంటి టూరిస్టు ప్లేసులు ఉన్నాయి. అలాగే కర్ణాటకలోని టిప్పు సుల్తాన్ కోట, చిత్రదుర్గ కోట, ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని కుతుబ్‌మినార్, ఎర్రకోట లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఏఎస్ఐ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments