Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానంకోసం చిన్నారిని బలిచ్చిన ఓ మహిళ

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (15:46 IST)
ఓ మహిళ తన సంతానం కలగకపోవడంతో రెండేళ్ళ చిన్నారిని ఓ మహిళ బలిచ్చింది. పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఆ మహిళ.... బాలుడి ప్రాణాల తీసింది. ఈ విషాదకర ఘటన ఢిల్లీలోజరిగింది.
 
రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో వివాహమైంది. అయితే, ఆమెకు పిల్లలు కలగక పోవడంతో తోడికోడళ్లు, మెట్టింటి వారు హేళన చేయసాగారు. 
 
ఇది భరించలేక నాలుగేండ్ల కిందట పుట్టిల్లు అయిన ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయిలో క్షుద్రపూజలు చేసే ఒక వ్యక్తిని ఆశ్రయించింది. సంతానం కలుగాలంటే ఒక చిన్నారిని బలి ఇవ్వాలని అతడు సూచించాడు.
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న ఆ మహిళ పొరుగున్న ఉన్న రెండున్నర ఏండ్ల బాలుడ్ని చంపాలని నిర్ణయించుకున్నది. శనివారం పక్క బిల్డింగ్‌ మేడపై ఒంటరిగా ఆడుకుంటున్నఆ చిన్నారి గొంతునులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో అక్కడ ఉంచింది.
 
మరోవైపు తమ కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిన్నారి గురించి పోలీసులు ఆరా తీసి గాలించగా బిల్డింగ్‌ మేడపై ఒక బ్యాగ్‌ కనిపించింది. 
 
దానిని తెరిచిచూడగా బాలుడి మృతదేహం అందులో ఉన్నది. దీనిపై దర్యాప్తు చేయగా ఆ చిన్నారిని తానే చంపినట్లు ఆ మహిళ ఒప్పుకున్నది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments