Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్ బైపోల్ : 184వ సారి బరిలో 'ఎలక్షన్‌ కింగ్'

సాధారణంగా ఎన్నికల్లో ఒకటి రెండు సార్లు మహా అయితే ఐదారు సార్లు పోటీ చేసి విరమించుకుంటారు. కానీ, ఈ ఎలక్షన్ కింగ్ మాత్రం ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు ఏకంగా 183 సార్లు పోటీ చేసి మరోమారు బరిలో

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (20:26 IST)
సాధారణంగా ఎన్నికల్లో ఒకటి రెండు సార్లు మహా అయితే ఐదారు సార్లు పోటీ చేసి విరమించుకుంటారు. కానీ, ఈ ఎలక్షన్ కింగ్ మాత్రం ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు ఏకంగా 183 సార్లు పోటీ చేసి మరోమారు బరిలో నిలిచాడు. ఆయన పేరు డాక్టర్ కె.పద్మరాజన్. పోటీ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా బరిలోకి దిగడం మాత్రం మానరు. గెలుపు గురించి పట్టించుకోకుండా స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూనే ఉంటారు. అందుకే ఎలక్షన్‌ కింగ్‌ అయ్యారు. 
 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్‌కే నగర్‌ నియోజకవర్గానికి డిసెంబర్ 21వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పద్మరాజన్ పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ వేశారు. తమిళనాడు సేలంకు చెందిన పద్మరాజన్‌ వృత్తిపరంగా డాక్టర్‌. 1988లో తొలిసారిగా ఆయన ఎన్నికల్లో పోటీచేశారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీచేస్తూనే ఉన్నారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పోటీ చేశారు. మాజీ రాష్ట్రపతులు కేఆర్‌ నారాయణ, అబ్దుల్‌ కలాం, ప్రతిభాపాటిల్‌కు పోటీగా ఆయన నామినేషన్‌ వేశారు. అంతేగాక.. ప్రముఖ రాజకీయ నాయకులు మన్మోహన్‌ సింగ్‌, వాజ్‌పేయి, జయలలిత, కరుణానిధి, పీవీ నరసింహరావు వంటి ప్రముఖులపైనా పోటీ చేశారు. 1991లో ప్రధాని పీవీ నరసింహరావుకు ప్రత్యర్థిగా పద్మరాజన్‌ నామినేషన్‌ వేసినప్పుడు ఆయనపై దాడి కూడా జరిగింది. అయినా సరే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం మానట్లేదు. అయితే ఎందులోనూ ఆయన విజయం సాధించలేకపోయారు. 
 
నామినేషన్‌ వేశాక ఆయన ఎలాంటి ప్రచారం చేయరు. నామినేషన్ డిపాజిట్ చెల్లించడం మినహా ఒక్కపైసా కూడా ఖర్చు చేయరు. ప్రజాస్వామ్యాన్ని నిరూపించడమే తన లక్ష్యమని చెబుతారు. అంతేకాదండోయ్‌.. ఎక్కువసార్లు ఎన్నికల్లో పోటీచేసినందుకు గానూ ఆయన గిన్నిస్‌ బుక్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ చోటుసాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments