Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు ఇంటి ఏసీలోంచి.. 40 పాము పిల్లలు.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (12:03 IST)
యూపీలోని ఓ రైతు ఇంట్లోని ఏసీలో 40 పాము పిల్లలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. మీరట్ జిల్లాలోని ఖంకర్‌ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పావ్లీ ఖుర్ద్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బయట నుంచి ఇంట్లోకి వచ్చిన రైతు శ్రద్దానంద్‌.. ఇంటి వరండాలో ఓ పాము పిల్లను చూశాడు. అతను దాన్ని బయట వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో పడుకునేందుకు వెళ్తే.. ఆ బెడ్‌పై మరో మూడు పాము పిల్లల్ని చూశాడు. ఎక్కడ నుంచి ఈ పాము పిల్లలు వస్తున్నాయో తెలియక.. అటూ ఇటూ చూశాడు. 
 
చివరికి ఆ గదిలో వున్న ఏసీ పైపు నుంచి కొన్ని పాము పిల్లలు బయటకు వెళ్లడాన్ని అతను గమనించాడు. అంతే టెన్షన్‌లో ఆ రైతు ఏసీ మెషీన్ బయటకుతీశాడు. ఆ ఏసీ పైపులో సుమారు 40 పాము పిల్లల్ని గుర్తించిన ఆ రైతు ఫ్యామిలీ షాకైంది. గత కొన్ని నెలలుగా ఏసీ మెషీన్ వాడకపోవడం వల్ల తల్లి పాము ఆ పైపులో గుడ్లు పెట్టి ఉంటుందని, ఇప్పుడు పిల్లలు బయటకు వచ్చినట్లు స్థానిక వెటర్నరీ డాక్టర్ వత్సల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments