Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ ప్రమాణాలతో అయోధ్యలో బస్టాండ్.. యూపీ సీఎం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (12:22 IST)
అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్‌స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఇందుకు రూ.400 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, నగరాల నుంచి ఆలయానికి సందర్శకులకు రానున్నారని రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ మీడియాకు చెప్పారు. అందుకోసమే ప్రపంచ ప్రమాణాలతో కూడిన బస్టాండ్ నిర్మించాలని తల పెట్టామన్నారు.

అయోధ్య-సుల్తాన్‌పూర్ రోడ్డు మధ్య నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. 1.5 కి.మీ. దూరం గల ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.20 కోట్లు ఖర్చవుతుంది. బులందర్ సహార్‌లోని అనూప్ సహార్‌లో బస్ స్టేషన్‌, అలహాబాద్‌లోని జీటీ రోడ్డుపై నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments