Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ-భర్త వేలాడుతుంటే.. ఫ్రిజ్‌లో భార్య మృతదేహం.. సూట్‌కేసులో ఇద్దరు అమ్మాయిల?

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఓ వైపు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా యూపీలోని అలహాబాద్‌లో ఘోరం జరిగింది. యూపీ, అలహాబాద్, ధుమాంగంజ్ ప్రాంతంలో దారుణ ఘటన స్థానిక

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (10:01 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఓ వైపు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా యూపీలోని అలహాబాద్‌లో ఘోరం జరిగింది. యూపీ, అలహాబాద్, ధుమాంగంజ్ ప్రాంతంలో దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికుల సమాచారంతో వెళ్లిన పోలీసులు, ఇంటికి వేసున్న తాళం పగులగొట్టి చూడగా, ఐదు మృతదేహాలు కనిపించాయి. 
 
సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ముందుగదిలో భర్త, అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, మరో గదిలోని సూట్ కేసు, బీరువాల్లో ఆయన ఇద్దరు కుమార్తెల మృతదేహాలున్నాయి. 
 
అలాగే మరో గదిలో నేలపై మూడో కుమార్తె మృతదేహం, ఫ్రిజ్‌లో భార్య మృతదేహం కనిపించాయి. ఓ కుటుంబాన్ని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసివుండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
హత్యకు అనంతరం బలవంతంగా ఫ్రిజ్, బీరువా, సూట్ కేసుల్లో మృతదేహాలను కుక్కి ఉంచారు. తన భార్య, కుమార్తెలను హత్య చేసిన ఆ వ్యక్తి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కోణంలో విచారిస్తున్నామని, ఇంటి బయట తాళం వేసి ఉండటంతో కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అలహాబాద్ పోలీసులు తెలిపారు. భార్య, పిల్లలను హత్య చేసిన తర్వాతే ఆ వ్యక్తి ఉరేసుకున్నట్లు తెలుస్తోందని.. భార్యాబిడ్డల్ని హతమార్చడానికి కారణం ఏమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments