భారత్‌లో అత్యంత కఠినమైన రాత పరీక్ష ఏది? ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఠాగూర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (10:26 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సూచన చేశారు. మన దేశంలో నిర్వహించే రాత పరీక్షల్లో అత్యంత కఠినమైన పరీక్షపై ఆరా తీసి ఓ విషయాన్ని కనుగొన్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. నిజానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. 
 
దేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏది అన్నదే ఆ పోస్టులో ప్రధాన టాపిక్. "ఇటీవల నేను 12th ఫెయిల్ అనే సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది కుర్రకారుతో మాట్లాడాను. మన దేశంలో నిర్వహించే రాత పరీక్షల్లో అత్యంత కఠినమైన పరీక్ష ఏది? అని అడిగాను. నేను మాట్లాడిన వారిలో ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నాడు. అతడు ఓ బిజినెస్ స్టార్టప్ ఏర్పాటులో పాలుపంచుకున్న వ్యక్తి. అతడు కూడా అత్యంత కఠినమైన పరీక్షగా యూపీఎస్సీ పరీక్షను పేర్కొన్నాడు. ఐఐటీ జేఈఈ కంటే యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా కష్టమైనదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అందరి అభిప్రాయం ఇదే అయితే... ఈ కింది జాబితాను వెంటనే మార్చాల్సిందే" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
 
పైగా, ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల వరల్డ్ ర్యాంకింగ్ జాబితాను కూడా రీట్వీట్ చేశారు. ఆ జాబితాలో చైనాకు చెందిన గావో కావో పరీక్ష అత్యంత కఠినమైన పరీక్షగా నెం.1 స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఐఐటీ జేఈఈ, మూడో స్థానంలో యూపీఎస్సీ ఉంది. ఆనంద్ మహీంద్రా సర్వే ప్రకారం ఈ జాబితాలో యూపీఎస్సీ ఎగ్జామ్ రెండో స్థానానికి, ఐఐటీ జేఈఈ పరీక్ష మూడో స్థానానికి మార్చాల్సి ఉంటుందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash: సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్.. టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌లో క‌నిపిస్తున్నాడు

Karti: అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది : హీరో కార్తి

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments