Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను బిర్యానీ, కూల్ డ్రింక్స్‌ అడిగింది.. నగలతో జంప్

పెళ్లి పేరిట ఓ యువతి యువకుడిని వివాహం చేసుకుంది. పెళ్లైన రెండు రోజుల్లో పెళ్లికొడుకు ఇంటివారు పెట్టిన నగలను, వెండి సామాన్లను దోచుకుని పరారైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య రె

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (17:54 IST)
పెళ్లి పేరిట ఓ యువతి యువకుడిని వివాహం చేసుకుంది. పెళ్లైన రెండు రోజుల్లో పెళ్లికొడుకు ఇంటివారు పెట్టిన నగలను, వెండి సామాన్లను దోచుకుని పరారైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య రెండు రోజుల్లోపే కనిపించకపోవడంతో షాకైన యువకుడు పోలీసులకు ఫిర్యదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లా కువాన్‌ హెది గ్రామంలో అజ‌య్ అనే యువ‌కుడికి ఓ మహిళ అమ్మాయిని పరిచయం చేసింది. అదే అమ్మాయిని అజయ్ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.
 
ఈ నెల 22న వీరి వివాహం జరిగింది. రెండు రోజుల పాటు అతనితో కాపురం చేసి.. జ్వరం తగిలిందని డ్రామా చేసింది. అజయ్ కూడా యువతిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. డాక్టర్ వద్ద నుంచి బయటికి వచ్చాక బిర్యానీ తినాలనిపిస్తుందని చెప్పింది. బిర్యానీ తీసిపెట్టాక కూల్ డ్రింక్స్ కావాలంది. అంతే.. కూల్ డ్రింక్స్ కోసం పక్క షాపుకెళ్లిన అజయ్‌ని మోసం చేసి ఆ యువతి పారిపోయింది. 
 
ఎంత వెతికినా భార్య కనిపించకపోవడంతో ఇంటికొచ్చిన అజయ్‌కి అప్పుడే అసలు నిజం తెలిసింది. ఇంట్లోని నగలన్నీ కనిపించట్లేదని గుర్తించిన అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువ‌తిని త‌మ‌కు ప‌రిచ‌యం చేసిన మ‌రో మ‌హిళ కూడా కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పారిపోయిన ఇద్దరు మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments