Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాఖ్.. సీన్ రివర్స్.. భర్త కాదు.. భార్యే తలాఖ్ చెప్పి విడిపోయింది..

ట్రిపుల్ తలాఖ్ అంశంపై సుప్రీంకోర్టుకు చెందిన రాజ్యాంగ బెంచ్ వాదనలు వింటున్న నేపథ్యంలో.. ఎప్పుడూ భర్తలే భార్యలకు చెప్పే ట్రిపుల్ తలాఖ్‌ను ఈసారి ఓ మహిళ చెప్పింది. భర్త వద్దనుకుని ట్రిపుల్ తలాఖ్ చెప్పి..

Webdunia
శనివారం, 13 మే 2017 (15:42 IST)
ట్రిపుల్ తలాఖ్ అంశంపై సుప్రీంకోర్టుకు చెందిన రాజ్యాంగ బెంచ్ వాదనలు వింటున్న నేపథ్యంలో.. ఎప్పుడూ భర్తలే భార్యలకు చెప్పే ట్రిపుల్ తలాఖ్‌ను ఈసారి ఓ మహిళ చెప్పింది. భర్త వద్దనుకుని ట్రిపుల్ తలాఖ్ చెప్పి.. విడాకులు పొందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో చోటుచేసుకుంది. 
 
పుట్టింటికి వచ్చిన కొన్ని నెలలు అయినా తాను, తన కుమార్తె గురించి పట్టించుకోలేదు. దీంతో విరక్తి చెందిన మహిళ భర్తకు తలాఖ్ చెప్పేసింది. మతం ఆచారం ప్రకారం విడాకులు తీసుకుంది. ఈ సందర్భంగా రాయ్ బరేలీలో బాధితురాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆరేళ్ల క్రితం తనకు వివాహం అయ్యిందని.. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
తనకు కుమార్తె పుట్టిన తరువాత వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆమె ఆరోపించారు. అదనపు కట్నం తీసుకురావాలని తన కుమార్తెను తన భర్త ఓ సారి కిడ్నాప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. అత్తింటివారి ఆగడాలు భరించలేక తాను పుట్టింటికి చేరుకున్నానని అన్నారు. అందుకే చేసేది లేక భర్తకు ట్రిపుల్ తలాక్ చెప్పేసినట్లు బాధితురాలు తెలిపింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments