Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్ వేధింపులు... నడి రోడ్డుపై చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె (Video Viral)

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (13:24 IST)
నిత్యం మద్యం సేవించి తనను దుర్భాషలాడుతూ, వేధిస్తుండటంతో తన తండ్రి వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని నడిరోడ్డుపై మోకాళ్లపై కూర్చోబెట్టి ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఈ మహిళ ఎవరో కాదు.. అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంత కుమార్తె. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె ఓ వ్యక్తిని మోకాళ్లపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తుంది. దీస్‌పూర్‌లోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
సదరు వ్యక్తి తన తండ్రి వద్ద గత కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు అతడిని హెచ్చరించినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. 
 
సోమవారం కూడా పీకల వరకు మద్యం సేవించివచ్చి తన ఇంటి తలుపులు కొట్టాడని ఆమె తెలిపారు. అందుకే ఇలా దేహశుద్ధి చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, సదరు డ్రైవరుపై ఇన్నాళ్లూ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి వద్ద పని చేసే కారు డ్రైవర్, ఆ మాజీ సీఎం కుమార్తె పట్ల ఇలా ప్రవర్తిస్తాడా అనే సందేహం ఉత్పన్నమవుతుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments