Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ సీఎం పోస్ట్ : విజయ్ రూపానీకి మరో ఛాన్స్...

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీతానై పార్టీని నడిపించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి మరోమారు అదృష్టం కలిసివచ్చింది. ఫలితంగా ఆయన మరోమారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (10:39 IST)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీతానై పార్టీని నడిపించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి మరోమారు అదృష్టం కలిసివచ్చింది. ఫలితంగా ఆయన మరోమారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
గుజరాత్ సీఎంగా మరో ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. దీంతో ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో కూడా తమ పార్టీ నేతగా విజయ్ రూపానీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పరిశీలకుడు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. 
 
అలాగే, గుజరాత్ ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్‌కు మరోమారు అవకాశం లభించింది. విజయ్ రూపానీని మళ్లీ సీఎంగా కొనసాగిస్తారా? లేదా? అనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. దీనికితోడు కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీని ముఖ్యమంత్రిగా పంపుతారంటూ ప్రచారం కూడా జరిగింది. 
 
అలాగే, మరికొందరి పేర్లు కూడా సీఎం రేసులో వినిపించాయి. అయితే, సీఎంగా మరో అవకాశాన్ని విజయ్ రూపానీకే ఇవ్వాలని కమలనాథులు నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments