Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని చితకబాది.. యువతిపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (09:41 IST)
సాయంసంధ్యవేళ రైలు పట్టాల పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమ జంటపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత యువకుడిని చితకబాది, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విలుపురం జిల్లా సూరామంగళంకు చెందిన ఓ యువకుడు, కండమంగళం గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ వేర్వేరు కంపెనీల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అదేవిధంగా నల్లూరు రైల్వే గేట్ సమీపంలోని పల్లిచ్చేరి మైదానంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 
 
జనసంచారం పెద్దగా లేని ప్రాంతంలో వీరిద్దరూ ముద్దూముచ్చట్లలో మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కొందరు దుండగులు తొలుత వారిపై దాడి చేశారు. ఆ తర్వాత ఆ యువకుడిని పట్టుకుని చితకబాది, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుండగుల బారినుంచి తప్పించుకున్న యువకుడు... ప్రియురాలిని అక్కడే వదిలివేసి... తన స్నేహితుడుకి ఫోన్ చేశాడు. 
 
అతని సహాయంతో మళ్లీ మైదానం వద్దకు వెళ్లి తన ప్రియురాలిని రక్షించే ప్రయత్నం చేయగా, దుండగులంతా కలిసి ఇద్దరు యువకులపై దాడి చేసి పారిపోయారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రియురాలిని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. తక్షణం స్పందించి నిందితుల్లో ఒకరైన అయ్యనార్‌ (27)ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments