Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ అంత్యక్రియల్లో రాహుల్ గాంధీ నవ్వులే నవ్వులు: ఆస్పత్రి నుంచి కరుణ డిశ్చార్జ్

దివంగత తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నవ్వుతూ ఫోటోలకు చిక్కుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ గాందీ నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన పక

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (12:09 IST)
దివంగత తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నవ్వుతూ ఫోటోలకు చిక్కుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ గాందీ నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన పక్కనున్న గులాంనబీ ఆజాద్‌ కూడా నవ్వుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
దీనిపై తమిళ తంబీలు మాత్రం ఫైర్ అవుతున్నారు. అమ్మ మృతితో రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోతే.. అంత్యక్రియలకు ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చిన రాహుల్ గాంధీ జయ సన్నిహితులకు ధైర్యం చెప్పాల్సిందిపోయి.. తామెందుకు ఎందుకు వచ్చామో అన్న విషయం మరచిపోయి నవ్వుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయ అంత్యక్రియల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. అమ్మకు గులాబీ పువ్వులతో నివాళులు అర్పించారు. అనంతరం పక్కకెళ్లి నిలబడ్డారు. రాహుల్ వెంట గులాం నబీ ఆజాద్ కూడా వున్నారు. ఆ సమయంలో అందరూ నవ్వుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 1న అలర్జీ సమస్యలతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం అర్ధరాత్రి డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని, పూర్తి విశ్రాంతి అవసరమని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments