Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ప్రయాణికులను చూసిన ఆగని బస్సు - డ్రైవర్‌ సస్పెండ్

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (10:21 IST)
ఢిల్లీలోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. అయితే, ఈ మహిళా ప్రయాణికులను ఎక్కించుకునేందుకు బస్సు డ్రైవర్లు ఆసక్తి చూపడం లేదు. బస్టాపుల్లో ప్రయాణికులు వేచివున్నప్పటికీ ప్రభుత్వం రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు మాత్రం బస్టాపుల్లో బస్సులు ఆపడంలేదు.
 
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఓ బస్‌స్టాప్‌లో వేచిచూస్తోన్న మహిళల్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన ఓ బస్సు డ్రైవర్‌ తీరుపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఉద్యోగంలోంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 
వీడియోలో రికార్డయిన దృశ్యాలను గమనిస్తే.. ముగ్గురు మహిళలు ఓ బస్‌ స్టాప్‌లో వేచి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. బస్సులోని ఓ ప్రయాణికుడిని దించేందుకు బస్సును నెమ్మదిగా పోనిచ్చిన డ్రైవర్‌.. అక్కడ బస్సు వెనుక పరుగులు పెడుతున్న మహిళల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో రికార్డయింది. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఆ వెంటనే ఆ డ్రైవర్‌ను గుర్తించి సస్పెండ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కొందరు డ్రైవర్లు మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపడంలేదని.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments