Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్ - మోడీ సర్కారుపై కాంగ్రెస్ ధ్వజం (Video)

వరుణ్
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (14:05 IST)
దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షాలతో అతలాకుతలమైపోతుంది. ఈ వానల కారణంగా పలు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. పార్లమెంట్ లాబీల్లో వాటర్ లీక్‌లో అవుతున్న దృశ్యాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. 
 
'బయట పేపర్ లీక్‌.. లోపల వాటర్ లీక్. పార్లమెంట్ లాబీలో నీటి లీకేజీ జరిగింది. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలోని సమస్యలను ఇది వెల్లడి చేస్తోంది. దీనిపై పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతాను' అని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. గత ఏడాది దీనిని ప్రారంభించారు.
 
ఇదిలావుంటే, ఇటీవల పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. యూజీసీ-నెట్ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు నిర్ధారించింది. వీటిని ఉద్దేశించే కాంగ్రెస్ తన ట్విట్టర ఎక్క్ వేదికగా స్పందించింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments