Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - స్కూల్స్ మూసివేత

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (15:57 IST)
వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, సోమవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 
 
కరోనా కేసులు పెరిగిపోతుండటంతో విద్యా సంస్థలు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్‌లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరిపాలనా పరమైన సమావేశాలను కేవలం వర్చువల్ విధానంలో చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
అలాగే, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకోవాలని కోరింది. మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 శాతం మందికి అనుమతి ఇచ్చింది. ఇక సమావేశాలకు 200 మంది, వివాహాది శుభకార్యాలకు 50 మందికి అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా, కోల్‌కతాలో నే గత మూడు రోజుల్లో మూడు రెట్లు, బెంగాల్‌లో 5.47 శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం