Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయా'లేడి' : పెళ్లి పేరుతో టెక్కీ వద్ద రూ.16 లక్షలు దోచుకుంది.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (11:32 IST)
ఓ మాయలేడి ఏకంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మోసం చేసింది. పెళ్లి పేరుతో ఏకంగా రూ.16.82 లక్షలను దోచుకుకుంది. ఈ ఘటన దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరు నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరుకు చెందిన అంకుర్ శర్మ అనే వ్యక్తి టెక్కీగా పని చేస్తున్నాడు. ఓ మేట్రిమోనియల్ సైట్ ద్వారా అతడికి కిరారా శర్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. 
 
ఈ నేపథ్యంలో అతడికి మరింత దగ్గరైన యువతి వివిధ కారణాలు చెబుతూ అంకుర్ శర్మ నుంచి ఏకంగా రూ.16.82 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత క్రమంగా అతడిని దూరం పెట్టసాగింది. 
 
పైగా, ఆమె వివాహానికి ఒప్పుకోకపోవడమేకాకుండా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments