Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్ చూస్తూ ప్రసవం చేసిన బాయ్‌ఫ్రెండ్.. చివరికి?

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (15:46 IST)
యువతపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. యూట్యూబ్‌ వీడియోలను చూసి యువత పెడదారిన పడుతోంది. ఏది వెతికినా యూట్యూబ్‌లో వీడియోల ద్వారా లభ్యం కావడంతో 19 ఏళ్ల యువతికి యూట్యూబ్‌లో చూస్తూ డెలీవరి చేయబోయాడు బాయ్ ఫ్రెండ్.. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో శిశువు మృతి చెందగా తల్లి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
 
వివరాల్లోకి వెళితే... గ్యాస్ సిలెండర్ డెలివరీ చేసే 27ఏళ్ల వ్యక్తికి 19ఏళ్ల యువతికి లవ్ అఫైర్ ఉంది. ఈ అఫైర్‌తో ఆ యువతి గర్భం దాల్చింది. తమిళనాడులోని పొన్నేరి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
8నెలల గర్భిణీ కావడంతో పురిటినొప్పులు మొదలయ్యాయని బాయ్ ఫ్రెండ్‌కు చెప్పింది. దీంతో ఆ వ్యక్తి సర్జికల్ గ్లౌజులు, బ్లేడులు కొనుక్కొని బైక్‌పైన మహిళను ఎక్కించుకుని పొలాల వైపుకు తీసుకెళ్లాడు. అక్కడ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ప్రసవం చేయబోయాడు. ఈ ఆపరేషన్‌లో శిశువు తల కాకుండా చేతులు ముందుకు వచ్చాయి. తల కోసం చెయ్యిని పట్టుకుని బలంగా లాగాడు.
 
శిశువు చెయ్యి విరిగిపోయింది. ఆ క్షణంలో యువతి తీవ్ర రక్తస్రావం కావడం మొదలైంది. యువతి ప్రాణాలు పోతాయని భయపడి బైక్ పై ఎక్కించుకుని 12కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నేరి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. వారిద్దరినీ చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రథమ చికిత్స చేసి యువతిని రాయపురంలోని ఆర్ఎస్ఆర్ఎం మెటర్నిటీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు మగశిశువును బయటకు తీశారు. 
 
శిశువు మృతి చెందగా.. బాగా రక్తం పోవడంతో మహిళ పరిస్థితి విషమంగా తయారైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని చెంపదెబ్బలతో స్టేషన్‌కు తీసుకెళ్లి మర్డర్ కేసు నమోదు చేశారు. ఇంకా ఈ ఘటనపై దర్యాప్తు మొదలెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments