Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై పోలీసులను బండబూతులతో చీల్చిచెండాడిన జొమాటో డెలివరీ గర్ల్...

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (17:48 IST)
ముంబై నగర పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టి బండబూతులతో చీల్చిచెండాడిందో డెలివరీగర్ల్. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే ఆ యువతి నోటికొచ్చిన అసభ్య పదజాలాన్ని ఉపయోగించి ఆడిపోసుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ముంబైలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో.. నెటిజన్లకు ఇబ్బందికరంగా మారింది. ఆ వీడియోలో ఆహారాన్ని డెలివరీ చేసే ఓ యువతి ట్రాఫిక్ పోలీసులను అభ్యంతరకరంగా దూషించడం రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను చూసినవారంతా ఆ యువతిపై ప్రవర్తను ఖండించారు. 
 
వీడియోలో పోలీసులను దూషించే యువతి పేరు ప్రియాంక మోరే (27) అని తెలిసింది. ఈమె జొమాటో సంస్థలో డెలివరీ గర్ల్‌గా పనిచేస్తోంది. ఈమె గత ఎనిమిదో తేదీ నేవీ ముంబై వాషీ సెక్టార్-8 ప్రాంతంలో నో-పార్కింగ్‌లో తన టూవీలర్‌ని నిలిపివుంచింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి గస్తీకి వచ్చిన పోలీసులు నో-పార్కింగ్‌లో నిలిపిన ఆమె బండిపై ఫైన్ కట్టమన్నారు. 
 
దీంతో ప్రియాంక ఆగ్రహంతో ఊగిపోయింది. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్లు బూతులు దండకం అల్లుకుంది. పోలీసులను అనుచిత పదజాలంతో దూషించింది. ఇంకా పోలీసుల వాహనాన్ని వెంబడించి వారి సెల్ ఫోన్లను లాక్కునేందుకు ప్రయత్నించింది. 
 
ప్రియాంక చేసిన ఈ ఓవరాక్షన్ అంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసినవారంతా జొమాటో డెలివరీ గర్ల్ చర్యను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులపై అభ్యంతరకరంగా వ్యవహరించిన ప్రియాంకపై కేసు నమోదైంది. ఇంకా ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments