ఆంధ్ర స్టయిల్ చికెన్ 65.. ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (18:59 IST)
మాంసాహర వంటల్లో చికెన్ వంటలు నోరూరిస్తాయి. ఎందుకంటే చికెన్ అద్భుతమైన రుచి, ఘుమఘుమల వాసన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చికెన్ వంటలకు చాలా ప్రసిద్ది. అంతేకాదు, చికెన్ వంటలను వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. చికెన్ వంటలను డిఫరెంట్ స్టైల్లో ప్రయత్నించడం చాలా సులభం. 
 
కొంతమంది ఒకే రకమైన చికెన్ వంటలను వండటం వల్ల బోరుకొడుతుంది. ఇంట్లో వారికి కొంచె డిఫెంట్ టేస్టుతో ఒక చికెన్ వంటకాన్ని వండిపెట్టండి. వారు కొత్త రుచిని ఎంజాయ్ చేయడమే కాకుండా మీకు ప్రశంసల జల్లు కురిపిస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఆ రుచికరమైన  చికెన్ వంటకాన్ని రెండు రకాలుగా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
 
బోన్‌లెస్ చికెన్ - 350 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కార్న్ ఫ్లోర్ - అర కప్పు
గుడ్డు - 1 (గుడ్డులోని మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని బాగా బీట్ చేయాలి) 
వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూను, అల్లం పేస్ట్ - అర టేబుల్ స్పూను
డీప్ ఫ్రై చేయడానికి- సరిపడా నూనె 
ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లిపాయలు - ఒక కప్పు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
సోయా సాస్ - ఒక టేబుల్ స్పూను,,పచ్చిమిర్చి - 2 (సన్నగా కట్ చేసుకుని, అందులోని విత్తనాలు తీసేయాలి) 
వెనిగర్ - రెండు టేబుల్ స్పూన్లు, నీళ్ళు : సరిపడా 
 
తయారుచేయు విధానం : 
1. ఒక గిన్నె తీసుకుని, అందులో కార్న్ ఫ్లోర్ , వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గుడ్డు, నీళ్ళు పోసి, చిక్కగా..జారుడుగా కలుపుకోవాలి.  ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కడాయ్ స్టౌమీద ఉంచి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన వాటిని టిష్యు పేపర్ మీద వేయడం వల్ల అదనపు నూనెను పీల్చుకుంటుంది.
 
ఆంధ్ర స్టైల్ చికెన్ 65...
2. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో సోయా సాస్, వెనిగర్, ఫ్రైడ్ చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని గ్రేవీలాగా కావాలనుకుంటే మీరు కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. అంతే సర్వ్ చేయడానికి బోన్‌లెస్ చికెన్ రెసిపి రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంగం పెరుగు ప్యాకెట్లో చచ్చిన ఎలుక, షాక్ తిన్న కొనుగోలు చేసిన వ్యక్తి, వీడియో

ఒకప్పుడు ట్రోలింగ్‌లో నేనే నెం.2.. కాన్ఫిడెన్స్‌లో నెం.1: నారా లోకేష్ (video)

అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, సిరి దంపతులకు మగబిడ్డ పుట్టాడోచ్

Samantha: సమంత, రాజ్ దంపతులకు సారె పెట్టిన చిరంజీవి, సురేఖ దంపతులు

సంగీతతో సర్దుకుపోనున్న విజయ్: అందుకే త్రిష దూరం అవుతుందా?

Sai durga Tej : పాతకాలపు రొటీన్ కథలను స్వస్తి చెప్పానంటున్న సాయి దుర్గా తేజ్

Sukumar: ప్రియదర్శి కథానాయకుడిగా తెలంగాణా నేపథ్యంలో సుకుమార్ చిత్రం

తర్వాతి కథనం
Show comments