చికెన్ బజ్జీ ఎలా చేయాలో తెలుసా..?

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (12:01 IST)
చికెన్‌లోని న్యూట్రియన్ ఫాక్ట్ అధిక మోతాదులో ఉంటాయి. చికెన్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. చాలామంది చికెన్ ఎక్కువగా తీసుకుంటే హానికరమని చెప్తుంటారు. కానీ అది నిజం.. దీనిలోని పోషకాలు ఇక ఏ పదార్థాలలో లభించవని పరిశోధనలో తెలియజేశారు. అందువలన భయపడకుండా చికెన్ తీసుకోవచ్చు.
 
పిల్లలు స్నాక్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి వారికి ఎప్పుడూ ఒకే విధంగా చికెన్‌తో కూరలు, పకోడీలు వంటివి చేసిస్తే ఎలాంటి ప్రయోజనాలుండవని చెప్తున్నారు. కాబట్టి వారికి నచ్చే విధంగా బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా
మిరపకాయలు (బజ్జీ)  - 10
పసుపు - చిటికెడు
కారం - కొద్దిగా
కరివేపాకు - పావు కప్పు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
మైదాపిండి - అరకప్పు
ఉల్లిపాయ తరుగు - పావుకప్పు
గరం మసాలా - కొద్దిగా
కొత్తిమీర - అరకప్పు.
 
తయారీ విధానం:
ముందుగా కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేయించి అందులో చికెన్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఆ తరువాత కొద్దిగా నీరు పోసి కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి తరువాత దించేయాలి. ఇప్పుడు మైడాపిడిలో కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.  
 
ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పూరీల్లా వత్తాలి. తరువాత పూరీని కత్తితో సన్నసన్నని రిబ్బన్స్‌లా కట్ చేయాలి. మిర్చీకి బాటు పెట్టి అందులో ముందుగా తయారుచేసిన చికెన్ మిశ్రమాన్ని నింపాలి. ఇలా నింపిన మిర్చీనీ కట్ చేసిన పూరీ రిబ్బన్స మీద ఉంచి రోల్ చేసి నూనెలో వేయించుకోవాలి. అంటే.. చికెన్ బజ్జీ రెడీ..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యువత ఆవేదనను అర్థం చేసుకని పరిష్కారాలు చూపాలి.. పవన్

ఉండి వైకాపాలో కలకలం : వైకాపాకు స్వస్తి చెప్పనున్న పీవీఎల్ నరసింహ రాజు

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్‌- పీఎన్‌బీతో డీల్

నీట్ ప్రశ్నపత్రం సూత్రధారులను కఠినంగా శిక్షిస్తాం : ప్రధాని మోడీ (వీడియో)

26 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన నాయగన్ చిత్రం నుంచి నా సన్నివేశాన్ని తీసేసారు: గద్గద స్వరంతో నటి ఆనంది

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments