చింతచిగురు రొయ్యల కూర..?

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:20 IST)
కావలసిన పదార్థాలు:
చింత చిగురు - 1 కప్పు
పెద్ద రొయ్యలు - పావుకిలో
ధనియాల పొడి - స్పూన్
జీలకర్ర పొడి - అరస్పూన్
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - 1 కట్ట
వెల్లుల్లి రేకులు - 5
నూనె - సరిపడా
గసగసాల పొడి - స్పూన్
దాల్చిన చెక్క పొడి - అరస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూన్
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 5
కారం - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకుని అందులో పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వాటికి పట్టేట్టుగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెవేసి అది బాగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిముక్కలు వేగాక అందులో రొయ్యలు కూడా వేసుకోవాలి. ఆపై రొయ్యలు పచ్చివాసన పోయేవరకు వేయించి మూతపెట్టి మరికాసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు చింతచిగురు పొడిని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గసగసాల పొడి, జీలకర్ర పొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసుకోవాలి. అవన్నీ వేసి బాగా కలుపుకుని తర్వాత కాసిన్ని నీళ్లు పోసి మూతపెట్టుకోవాలి. చివరగా కొత్తిమీరతో అలంకరిస్తే సరిపోతుంది. అంతే వేడివేడి చింతచిగురు రొయ్యల కూర రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉండి వైకాపాలో కలకలం : వైకాపాకు స్వస్తి చెప్పనున్న పీవీఎల్ నరసింహ రాజు

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్‌- పీఎన్‌బీతో డీల్

నీట్ ప్రశ్నపత్రం సూత్రధారులను కఠినంగా శిక్షిస్తాం : ప్రధాని మోడీ (వీడియో)

26 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిపోయిన మహిళ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

Namit Malhotra :ఈ రోజు విడుదల కావాల్సిన రామాయణ ట్రైలర్ వాయిదా పడింది.

తర్వాతి కథనం
Show comments