నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

ఐవీఆర్
గురువారం, 23 ఏప్రియల్ 2026 (14:53 IST)
సామాజిక బాధ్యతను తెలుగు విద్యార్ధుల్లో పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా  స్థానిక ఈస్ట్ విండ్సర్ నగరంలో చేపట్టిన హైవే దత్తత సామాజిక స్పృహను చాటిచెప్పింది. పర్యావరణ పరిరక్షణను ఒక యజ్ఞంలా భావించి గతంలో పలు నగరాల్లో విజయవంతంగా సేవలు అందించిన నాట్స్, అదే స్ఫూర్తితో ఈసారి న్యూజెర్సీలో ఈస్ట్ విండ్సర్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంది.
 
ఈ పారిశుధ్య కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. సమాజం పట్ల బాధ్యతను చిన్నతనం నుంచే అలవరుచుకోవాలనే సంకల్పంతో, రహదారి పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించి తమ వంతు తోడ్పాటును అందించారు. సమాజ హితం కోసం పిల్లలు చూపిన ఈ చొరవ పెద్దలను సైతం ఆలోచింపజేసింది.
 
విద్యార్థులు చిన్ననాడే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వల్ల వారిలో క్రమశిక్షణ, సామాజిక స్పృహ పెరుగుతాయని  నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి అన్నారు.. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, ఇలాంటి పనులు విద్యార్థుల భవిష్యత్తుకు మరియు వారి విద్యా సంబంధిత సేవా గుర్తింపునకు ఎంతో తోడ్పడతాయని ఆయన వివరించారు.
 
ఈ కార్యక్రమంలో నాట్స్ కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొని పనులను పర్యవేక్షించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో సామాజిక హితమే లక్ష్యంగా నాట్స్ నిరంతరం కృషి చేస్తోందని నాట్స్ నాయకులు తెలిపారు. నాట్స్ ఎడాప్ట్ ఎ హైవేలో పాల్గొన్న వారందరిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రైతులను ముంచేసిన అకాల వర్షాలు (video)

ఏపీలోనే కాదు.. దక్షిణాదిలో మధ్యప్రదేశ్‌ దొంగలతో జాగ్రత్త.. ముగ్గురి అరెస్ట్

బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు మహిళలు మృతి

ఇరాన్‌లో అంతర్గత విభేదాలు, అమెరికాతో మాట్లాడేవాళ్లెవరో చూస్తున్నా: ట్రంప్

సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకెళ్లిన సోదరుడు, ఎందుకు?, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR, Charan: భారతీయ బాక్సాఫీస్‌ను ఏలడానికి రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ మరోసారి కలుస్తున్నారా?

Anil Ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమానుంచి అనిల్ రావిపూడి తప్పుకున్నాడా?

Mahesh Babu: పోకిరి లా 100 రోజుల చిత్రాలు ఇప్పుడు టాలీవుడ్ లో ఎందుకు రాలేకపోతున్నాయి?

Spirit: గొర్రెలు కాచుకునే మహిళ నిర్మించిన సినిమా స్పిరిట్ సిద్ధమవుతోంది

Chiranjeevi Photo shoot:ఫస్ట్ లుక్ గా మెగాస్టార్ చిరంజీవి వెనుకభాగాన్ని చూపించిన బాబీ కొల్లి

తర్వాతి కథనం
Show comments