Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు మహిళలకు అరుదైన అవకాశం: మోస్ట్ ఫేమస్ ఎన్బీసీ గేమ్‌ షో ది వాల్‌‌లో ఛాన్స్

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (21:12 IST)
అమెరికాలో అత్యంత ఆదరణ టెలివిజన్ గేమ్ షో ఎన్బీసీ గేమ్ షో ది వాల్ తెలుగు మహిళలకు అరుదైన అవకాశం లభించింది. ది వాల్ గేమ్ షో కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. అలాంటి గేమ్ షోలో తెలుగు వారైన కవి, రాధికలు పాల్గొననున్నారు. వీరిద్దరూ తల్లి, కూతురులు కావడం విశేషం. నాలెడ్జ్, సమయస్ఫూర్తి ఇవన్నీ కలగలిసిన ఈ షోలో ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. అందుకే దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది.
 
ఎన్టీబీసీ గేమ్ షో ది వాల్ వచ్చే సోమవారం అమెరికా కాలమానం ప్రకారం రాత్రి గం: 9:00లకు ఈ షో ప్రసారం కానుంది. కవి, రాధికలు ఈ షోలో పాల్గొనడం యావత్ తెలుగుజాతికి గర్వకారణమైన విషయం. ఎందుకంటే ఈ షోలో పాల్గొనే అభ్యర్ధులను వారికి ఉండే జ్ఞానం, ప్రణాళిక, వ్యక్తిత్వం ఇలా రకరకాలుగా పరీక్షించి ఎంపిక చేస్తారు.
 
ప్రస్తుతం ది వాల్ గేమ్ షో ఐదో సీజన్ నడుస్తోంది. ప్రతీ సీజన్ అత్యంత జనాదరణ పొందుతూ వస్తోంది. అమెరికాలో తెలుగువారు ఎన్బీసీ గేమ్ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో అమెరికాలో ఉండే తెలుగువారిలో ఈ షోపై మరింత ఆసక్తి పెరిగింది. న్యూజెర్సీలోని గ్రీన్ బ్రూక్‌లో ఉంటున్న కవి, రాధికలు మంచి డ్యాన్సర్లు కావడం విశేషం. కవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ పేరుతో అమెరికాలో ఇండియన్ డ్యాన్స్‌కు ఆదరణ పెంచుతున్నారు. మన సంప్రదాయ నృత్యాన్ని కూడా అమెరికన్లకు పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్బీసీ గేమ్ షో ది వాల్‌లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments