Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు వీసా... డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కొత్త ట్విస్ట్... ఏంటది?

అమెరికా దేశం వెళ్లేందుకు వీసా కావాలంటే మామూలు విషయంగా భవిష్యత్తులో అనిపించదని ఆ దేశ అధ్యక్షుడు చేస్తున్న చట్టాలను చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా డోనాల్డ్ ట్రంప్ పాలనా విభాగం యూఎస్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఓ మోస్తరు జర్క్ ఇచ్చింది. అదేంటయా అ

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (16:51 IST)
అమెరికా దేశం వెళ్లేందుకు వీసా కావాలంటే మామూలు విషయంగా భవిష్యత్తులో అనిపించదని ఆ దేశ అధ్యక్షుడు చేస్తున్న చట్టాలను చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా డోనాల్డ్ ట్రంప్ పాలనా విభాగం యూఎస్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఓ మోస్తరు జర్క్ ఇచ్చింది. అదేంటయా అంటే... దరఖాస్తులో విధిగా సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్.. ప్రస్తుత నెంబరుతో పాటు ఇదివరకటి నెంబర్లు కూడా తెలుపాలి. 
 
ఇంకా ఇ-మెయిల్ ఖాతాలతో పాటు సోషల్ మీడియాలో చేస్తున్న యాక్టివిటీస్ తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఖాతాలు కూడా తెలుపాల్సి వుంటుంది. ఇలాంటివన్నీ తెలుసుకోవడం ద్వారా దేశంలోకి అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం తగ్గించుకోవచ్చని ఇలా నిబంధన విధించినట్లు తెలిపింది. ఈ మేరకు కొత్త నిబంధనావళిని ఫెడరల్ రిజిస్ట్రార్‌కు పంపింది. 
 
దీనితో ఇప్పుడు వీసా కోసం అప్లై చేసుకునేవారు విధిగా తమ ఇ-మెయిల్ ఖాతాలతో పాటు సోషల్ నెట్వర్కింగ్ ఖాతాల వివరాలను కూడా తెలుపాల్సి వుంది. అంతేనా అంటే... ఇంకావుంది. గత ఐదేళ్లుగా ఏయే దేశాల్లో తిరిగారు, ఎక్కడైనా వీసా క్యాన్సిల్ అయ్యిందా గట్రా అనేక ప్రశ్నలు అందులో వున్నాయి. మరి ఇవన్నీ సక్రమంగా వున్నాయని అధికారులకు అనిపిస్తేనే వీసాకు అనుమతి లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments