Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం దినఫలాలు : ఇల్లు సందడిగా ఉంటుంది...

మేషం : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. శ్రీమతిసలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (06:04 IST)
మేషం : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. శ్రీమతిసలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
వృషభం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పాత సమస్యల నుండి బయటపడతారు. మీ కళత్రవైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. ప్రయాణాలు నూతనోత్సాహం కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మిథునం : సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. రావలసిన ధనం చేతికందటంతో మీలోపల ఆలోచనలు చోటుచేసుకుంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. సమావేశాలలో మెళుకువగా వ్యవహరించండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది.
 
కర్కాటకం : పాతమిత్రుల, ప్రముఖులతో చర్చలు జరుపుతారు. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉండును. కార్యసాధనలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. మిత్రులలో ఒకరి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం : ఫ్యాన్సీ, బంగారం, వెండి, లోహ, రత్న వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలకు బంధువులు, చుట్టుప్రక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒప్పందాలు, హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
కన్య : బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళుకువ వహించండి. అనుకోని కారణాల వల్ల ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు చేసుకొనుట వలన శుభం చేకూరగలదు. కొబ్బరి, పండ్ల, పూల, కూరచిరు వ్యాపారస్తులకు సామాన్యం. విద్యార్ధులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి.
 
తుల : కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వైద్యులకు మెలకువ అవసరం. స్వల్పఅనారోగ్యం, ధననష్టం కలిగే అవకాశం ఉంది. ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్థులకు అనుకూలం. ఉద్యోగస్తులకు అధికారుల గుర్తింపు లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
వృశ్చికం : బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు సదావకాశాలు లభించినా ఆర్ధిక ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు.
 
ధనస్సు : ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయుట మంచిది.
 
మకరం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది  కాదని గమనించండి. సంఘంలో మీ స్థాయి పెరుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఏకాగ్రత వహించలేరు. మిత్రుల సహయ సహకారాలు లభిస్తాయని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
కుంభం : వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. స్పెక్యులేషన్ చేయువారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తలచిన కార్యములు నెరవేరతాయి.
 
మీనం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వ్యాపారులు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్ధిక సంతృప్తి ఉండదు. వాహన యోగం కలదు. హామీలు ఉండుట మంచిది కాదు అని గమనించండి. ఆడిటర్లకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తర్వాతి కథనం
Show comments