Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-08-2018 - శనివారం మీ రాశి ఫలితాలు...

మేషం: ఖాది, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. దూరప్రయాణాలు ఏర్పాట్లు ఫలించకపోవచ్చు. మనసులో భయాందోళనల

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (09:43 IST)
మేషం: ఖాది, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. దూరప్రయాణాలు ఏర్పాట్లు ఫలించకపోవచ్చు. మనసులో భయాందోళనలు, అనుమానాలు ఉన్నా డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తిచేస్తారు.
 
వృషభం: భీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వలన ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు వంటివి అధికమవుతాయి.  
 
మిధునం: మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వలన అభాసు పాలయ్యే ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. 
 
కర్కాటకం: మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలపై చుట్టుప్రక్కల వారి మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యంలో మెళకువ అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. 
 
సింహం: వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. కుటుంబీకుల ధోరణి చికాకు పరుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వలన కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. 
 
కన్య: మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. అనుకూలతలున్నా మీ యత్నాలు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. మరీంటే కిట్టని వ్యక్తులు మీరకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు.  
 
తుల: ఉద్యోగస్తులకు కార్యలయా పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం ఫలిస్తుంది. ఉత్సాహంగా మీ యత్నాలు కొనసాగించండి.
 
వృశ్చికం: చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తికాగలవు. వ్యాపారాలు, అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండడం వలన మేలు చేకూరుతుంది. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలి పెట్టుబడులు అనుకూలం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్త అవసరం. గృహ అవసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. 
 
ధనస్సు: నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. విరోధులు వేసే పథకాలను తెలివితో త్రిప్పి కొట్టగలుగుతారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీరు అభిమానించే వ్యక్తి నుండి ప్రసంసలు పొందుతారు. వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులుకు గురువుతారు. 
 
మకరం: మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాసం ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహానం కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానూకూలమవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
కుంభం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. సొంతగా గాని, భాగస్వామ్యంగా గాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.  
 
మీనం: అనుబంధాలలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఖర్చులు సామాన్యం. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

బంగారు నగల్లో వాటా ఇవ్వాల్సిందే లేదా చితిపై తల్లి శవంతో పాటు నన్నూ కాల్చేయండి (Video)

వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

తర్వాతి కథనం
Show comments