Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు మీ రాశి ఫలాలు : దంపతుల మధ్య కలహాలు...

మేషం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా దుబారా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చెల్లింపులు వాయిదా వేస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (09:12 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా దుబారా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చెల్లింపులు వాయిదా వేస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది.
 
వృషభం : ఎదురయ్యే ప్రతి విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. గృహోపకరాణాలు అమర్చుకుంటారు. స్నేహితుల మీ జీవితానికి మూల స్థంభాలుగా మారతారు. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించడం క్షేమదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
మిథునం : నిర్మాణ పనులు, మరమ్మత్తులలో ఏకాగ్రత వహించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రుణ విముక్తుల కావడంతో మానసికంగా కుదుపటపడుతారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా తాత్కాలికమేనని గమనించండి.
 
కర్కాటకం : రాజకీయ నాయకుల సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలు ఆదాయంపై ధన సంపాదనపై మరింత దృష్టిసారిస్తారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు.
 
సింహం : నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రముఖల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు.
 
కన్య : విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పని భారం అధికమవుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు.
 
తుల : ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. ధనం ఏ కొంతైనా పొదపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం : డాక్టర్లు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. స్త్రీలకు సంతానం పనివారలతో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
ధనస్సు : బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. వస్త్ర, బంగారు, వెండి లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు.
 
మకరం : ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసే వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తెలుత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి.
 
కుంభం : రాజకీయాలలో వారికి రహస్యపు విరోధులు చేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిత్రుల కలయికతో మనసుకుదుటపడుతుంది. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాలలో వారికి లాభదాయకం. స్త్రీలకు పనివారతో చికాకులు తప్పవు.
 
మీనం : స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. నూతన ఒప్పందాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments