Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-04-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. పాత మిత్రుల కలయికతో..

మేషం : మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలో

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (06:16 IST)
మేషం : మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. వాయిదా పడిన మెుక్కుబడులు తీర్చుకుంటారు.
 
వృషభం : కష్ట సమయంలో ఆత్మీయులు చేదోడు వాదోడుగా నిలుస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభించలేకపోతారు. గృహావసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. క్రీడల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగును. వ్యాపారులకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికం. కుటీంబీకులతో కలిసి విందులల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మీ ఆశ నెరవేర్చుకోవడానికి ఇదే సమయం. ఇంటా, బయట కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగును. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. విందు, వినోదాలల్లో చురుకుగా పాల్గొంటారు. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.
 
సింహం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కార్యసాధనలో  అనుకూలత, ప్రత్యర్థివర్గాలపై విజయం సాధిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
కన్య : నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. వేళతప్పి భోజనం హానికరం. శారీరక శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సవ్యాలు పెంపొందుతాయి. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు పని భారం తగ్గడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది. 
 
తుల : ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారతీస్తాయి. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. దైవసేవా కార్యక్రమాల పట్ల, వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది.
 
వృశ్చికం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య స్వల్ప చికాకులు, అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.
 
ధనస్సు : వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. మిత్రులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ లక్ష్యాన్ని చేరుకొనే విషయంలో మెళకువలు అవసరం. 
 
మకరం : హోటల్, తినుబండ, క్యాటరింగ్ పనివారలకు కలిసివచ్చే కాలం. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. రాజకీయాల వారు కార్యకర్తల అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచిది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం : కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. పారిశ్రామికులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురవుతారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. 
 
మీనం : విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ బలహీలతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. అంతగా పరిచయంలేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానిక్ మీడియా వారు ఊహించని సంఘటన లెదుర్కుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Bhagavad Gita: కుమార్తె పెళ్లి.. అతిథులకు భగవద్గీత కాపీలు పంపిణీ చేసిన తండ్రి.. ఎక్కడ?

పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

అన్నీ చూడండి

లేటెస్ట్

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments