Webdunia - Bharat's app for daily news and videos

Install App

07-05-2019 మంగళవారం రాశిఫలాలు

Webdunia
మంగళవారం, 7 మే 2019 (09:38 IST)
మేషం : వృత్తి వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ధనం ఏమాత్రం నిల్వచేయలేక పోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ప్రేమికులకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
వృషభం : దూర ప్రయాణాల పట్ల అప్రమత్తత అవసరం. వస్త్ర బంగారు వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలు పరోపకారానికి పోవడం వల్ల మాటపడవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం : బంధువుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్ లోపం, కార్మిక సమస్యల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ఆరోగ్య, ఆహార విషయంలో శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు.
 
కర్కాటకం : కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సాహాయం అర్థించవచ్చు జాగ్రత్త వహించండి. సంగీత సాహిత్య సదస్సుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పథకాల్లో పనివారితో లౌక్యం అవసరం. మిమ్మల్ని అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
సింహం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఆశాజనకం. ఇతరుల ద్వారా మీ పనులు నెరవేర్చుకొనుటకై చేయు యత్నాలు ఫలిస్తాయి. కళారంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నతరహా వృత్తులలో వారికి కలిసి రాగలదు. స్త్రీల వాక్ చాతుర్యంతో, తెలివితేటలతో రాణించి మంచి గుర్తింపు పొందుతారు. ఖర్చుల విషయంలో అచితూచి వ్యవహరించడం వల్ల క్షేమదాయకం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తారు.
 
తుల : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. రాజకీయాల్లో వారికి  ప్రత్యర్థుల పట్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ఒక వ్యవహరంలో అనారోచితంగా తీసుకున్న నిర్ణయానికి కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. వస్త్ర, వెండి, బంగారు వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది.
 
వృశ్చికం : భాగస్వామ్యుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలు, పట్టుదల, మొండితనగా వ్యవహరించి అయిన వారికి దూరమవుతారు, కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ది పొందడానికి యత్నిస్తారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చురుకుగా సాగడంతో ఒకింత మనశ్సాంతి పొందుతారు.
 
ధనస్సు : విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టర్లకు సంబంధించిన విషయంలో పునరాలోచన అవసరం. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహాకారాలు అందిస్తారు. లాయర్లకు డాక్టర్లకు మందకొడిగా సాగుతుంది.
 
మకరం : ఏదైనా ఆకస్మికంగా అమ్మే అవకాశం ఉంది. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కొంతమంది మీ నుంచి ధన సహాయం అర్ధిస్తారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
కుంభం : విదేశాలు వెళ్లే యత్నాలలో సఫలీకృతులవుతారు. ప్రముఖుల కలయికతో మీ సమస్యకు ఒకటి సానుకూలమవుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిదానంగా నిలదొక్కుకుంటారు. బంధువర్గాల నుంచి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. ఏమాత్రం పొదువు సాధ్యంకాదు. మీ సంతానం అతిగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

లేటెస్ట్

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

తర్వాతి కథనం
Show comments