Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం (13-08-18) దినఫలాలు - స్త్రీలకు పరిచయాలు - వ్యాపకాలు...

మేషం: ఆలయ సందర్శనాలలో స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరి

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (09:14 IST)
మేషం: ఆలయ సందర్శనాలలో స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. రవాణా రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
వృషభం: స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఊహించని ఖర్చుల వలన స్వల్ప ఇబ్బందులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. బంధువుల ఆకస్మిక రాకతో సందడి కానవస్తుంది.  
 
మిధునం: వృత్తుల వారికి లభించిన అవకాశాలు ఏమాత్రం సంతృప్తినీయవు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వలన అప్రమత్తత అవసరం. నూనె, ఎండుమిర్చి, పసుపు, ప్రత్తి, పొగాకు కంది వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం: సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఫ్యాన్సీ, రసాయనిక, సుగంధ ద్రవ్య, మందులు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
సింహం: ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రుణం కొంత మెుత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడుతారు. సోదరీసోదరుల మధ్య అనురావాత్సల్యాలు పెంపొందుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.   
 
కన్య: మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ద్విచక్ర వాహనంపా దూరప్రయాణం క్షేమం కాదు. బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. తప్పనిసరి చెల్లింపులు, ఆకస్మిక ఖర్చుల వలన స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు.  
 
తుల: వ్యాపార రీత్యా ఆకస్మికంగా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. బంధుమిత్రుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. విద్యార్థులకు విదేశీ చదువుల అవకాశం లభిస్తుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆందోళన కలిగించిన సమస్య పరిష్కారమవుతుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు. 
 
వృశ్చికం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మార్కెటింక్ , ఆడిటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. వ్యవసాయ రంగాలవారికి నూతన ఆలోచనలు స్పురిస్తాయి.    
 
ధనస్సు: ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దూరప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరం. దైవ, పుణ్య కార్యాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బహుమతులు అందజేస్తారు. 
 
మకరం: కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. వానహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి. 
 
కుంభం: కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమంగా నిలదొక్కుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రతి స్వల్ప విషయానికి అసహనం ప్రదర్శిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. 
 
మీనం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురుకావడంతో మీ కష్టాన్ని, ఆందోళనను గుర్తిస్తారు.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments