Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం (15-07-18) దినఫలాలు - పెంపుడు జంతువుల పట్ల...

మేషం: మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. కీలకమైన వ్యవహారాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీరు పరోక్షంగా చేసే కార్యక్రమాలలో

Webdunia
ఆదివారం, 15 జులై 2018 (09:45 IST)
మేషం: మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. కీలకమైన వ్యవహారాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీరు పరోక్షంగా చేసే కార్యక్రమాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. క్రీడా కారులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను బహుమతులు అందజేస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విద్య సాంఘిక, సాంస్కృతిక రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పెంపుడు జంతువుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
మిధునం: ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మెుదలెడుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారిలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. మీ కళత్ర, మీ కుటుంబీకుల మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. 
 
కర్కాటకం: విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి చేయు యత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ముఖ్యుల రాకపోకలు కూడా లభిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
సింహం: వ్యాపారాల్లో పోటీ తత్వం ఆందోళన కలిగిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గ్రహించండి. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో ఒకింత అసహానానికి గురవుతారు.  
 
కన్య: మీ సోదరీసోదరులతో కలిసి విందు, వినోదాలలో పాల్కొంటారు. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. రచయితలు, పత్రికా, మీడియా రంగాలవారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు వివాదస్పదమైన వ్యాక్యానాలు చేసి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
తుల: స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దూరప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగలకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల గురించి మంచి పథకాలు వేస్తారు. వ్యవసాయ, తోటల రంగాలవారికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దైవం మీద చేసే పనిమీద ధ్యాస, ధ్యేయం, ఏకాగ్రత వహించండి. మీరు హాస్యానికి చేసిన వాఖ్యలే వివాదాస్పదమవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. 
 
ధనస్సు: ఫ్యాన్సీ, కిరాణా, మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు అభివృద్ధి కానవస్తుంది. మీరు ఉద్ధేశ్య పూర్వకంగా ఎవరినీ దూషించకపోయినా ఎదుటివారి అపోహలకు లోనైయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. వ్యాపార, వ్యవహారాల్లో ఖచ్ఛితంగా మెలగండి.  
 
మకరం: ఆత్మీయులను విమర్శించడం మంచిదికాదని గమనించండి. రుణ, విదేశీయాన యత్నాల్లో ఆటంకాలెదుర్కుంటారు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. మీ వ్యవహార జ్ఞానం, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కుంభం: సినిమా, కళారంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. పెద్దమెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. 
 
మీనం: మీ ఉన్నత స్థితిని చూసి ఓర్వలేనివారు అధికమవుతున్నారని గమనించండి. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాలలోవారికి పనివారలతో సమస్యలు తలెత్తగలవు. మీ సంతానం వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఏ విషయాన్ని తెగేవరకూ లాగడం మంచిది కాదు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments