Daily Horoscope
✕

17-01-2019 గురువారం దినఫలాలు : పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో...

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (08:36 IST)
మేషం: విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. ఎప్పటి నుండో వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రయాణాలలో చికాకు, నిరుత్సాహం వంటివి తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఆలోచనులు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి.
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు మీరు చూసుకోవడం ఉత్తమం. సాంస్కతిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ అంచనాలు నిజమై ఊపిరి పీల్చుకుంటారు. ఉన్నట్టుంది వేదాంత ధోరణి కానవస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పులు గమనిస్తారు. కీలకమైన పత్రాల విషయంలో సమాచారం అందుకుంటారు.  
 
మిధునం: ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు పై అధికారులతో అవగాహన కుదరదు. ఋణ యత్నాలు వాయిదాపడుతాయి. ఊహించని వారి నుండి ఆహ్వానాలు అందుకుంటారు.  
 
కర్కాటకం: గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ధి పొందిదడానికి ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోతారు. విద్యాసంస్థలలో వారికి చికాకులు తలెత్తుతాయి. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతాయి.   
 
సింహం: పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారము నందు రావలసిన బాకీలు వచ్చును. సహోద్యోగులతో సంబంధాలు బలపడుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ఇతరులకు సలహాలు ఇచ్చి మీరు సమస్యలను తెచ్చుకుంటారు.
 
కన్య: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామిక ఒప్పందాలు ప్రముఖులతో చర్చలు సత్ ఫలితాలు ఇస్తాయి. చిన్న తరహా పరిశ్రమ వారికి లాభదాయకంగా ఉంటుంది. పాతమిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు.  
 
తుల: ప్రైవేటు సంస్థలలోని వారి ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడుతాయి. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన అగ్రిమెంటులు వాయిదా వేస్తారు. మీ సంతానం మొండివైఖరి వలన చికాకులు వంటివి ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం: ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తోటల రంగాలలో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. చేపట్టిన పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఓర్పు, సంయమనం అవసరం.  
 
ధనస్సు: భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. కంప్యూటర్, టెక్నికల్ రంగాలలో వారికి కలిసివచ్చే కాలం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. రావలసిన మొత్తం కొంత ముందు వెనుకలుగానైనా అందడం వలన ఇబ్బందులు ఉండవు. 
 
మకరం: నిరుద్యోగులు ఇంటర్వూల్లో విజయం సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిమీద ఏకాగ్రత వహించలేరు. విద్యార్థులకు ఉన్నత విద్యల విషయంలో ఒత్తిడి, ఆందోళన తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.    
 
కుంభం: స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆత్మవిశ్వాసనం రెట్టింపవుతుంది. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడడం మంచిది. భాగస్వామిక వ్యాపారాలు విడనాడి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్పురిస్తుంది.   
 
మీనం: ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. మధ్యవర్తిత్వం. వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యంత వేగంగా బలపడుతున్న అర్నాబ్ తుఫాను - తీర ప్రాంత వాసులకు హైఅలెర్ట్

పెళ్లి చేసుకోకపోతే ఫ్యానుకు ఉరేసుకుంటానంటూ ప్రియుడికి వార్నింగ్.. అన్నంత పని చేసిన ప్రియురాలు

Hyderabad: దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్... బాల్య వివాహాన్ని అలా అడ్డుకున్నారు...

ఎల్ నినో ప్రభావం.. నీటి కొరత.. అప్రమత్తంగా విశ్వవిద్యాలయాలు

కృత్రిమ మేధతో మరణాన్ని సృష్టించుకుని పోలీసులనే బురిడీ కొట్టించిన నిందితుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

26-10-2026 సోమవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

25-10-2026 ఆదివారం నాటి రాశి ఫలాలు- అనవసరమైన ఖర్చులకు దూరంగా వుంటే.?

25-10-2026 నుంచి 31-10-2026 వరకు మీ వారఫలాలు - ఎవరినీ తప్పుపట్టవద్దు

కలలో ఏమైనా తింటున్నట్లు చూస్తే.. పండ్ల రసం తాగినట్లు కలగంటే?

24-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు - మాటల్లో సంయమనం పాటించడం మంచిది..

తర్వాతి కథనం
Show comments