Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం (18-07-2018) దినఫలాలు - తలదూర్చి సమస్యలు తెచ్చుకోవద్దు

మేషం: ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడవలసి వస్తుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. స్వతంత్య్ర నిర్ణయాలు తీసుకొనుట వలన శుభం చేకూరగల

Webdunia
బుధవారం, 18 జులై 2018 (08:58 IST)
మేషం: ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడవలసి వస్తుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. స్వతంత్య్ర నిర్ణయాలు తీసుకొనుట వలన శుభం చేకూరగలదు. బహుమతులు అందుకుంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి.
 
వృషభం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారిపట్టే ఆస్కారం ఉంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. మీ మాటతీరు, పద్దతులతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.  
 
మిధునం: ఆర్థిక విషయాలలో భాగస్వామి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనిపై ఏ మాత్రం ఆసక్తి ఉండదు. స్త్రీలకు షాపింగ్‌లోను అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
కర్కాటకం: కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు సంబంధించిన అధికారుల సహకారం అందుతుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటకి తెలియకుండా గోప్యంగా ఉంచండి. పండ్ల, పూల, కూరగాయల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం కానవచ్చును. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. అందరిలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
సింహం: బంగారు, వెండి, లోహ, రత్న వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. ప్రయాణాలలో ఒకరి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. 
 
కన్య: నిరుద్యోగులు ఉద్యోగానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యములో ఆకస్మిక ఆందోళన తప్పదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
తుల: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండడం క్షేమదాయకం. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
వృశ్చికం: వృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. చిన్నారుల, విద్య ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. ఒక విషయంలో మిత్రులపై పెట్టుకున్న నమ్మకం వమ్ము అవుతుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం.  
 
ధనస్సు: ఆర్థిక విషయాలకు సంబంధించి ఆందోళనలు అధికం అవుతాయి. వాణిజ్య రంగాలలోని వారికి చురుకుదనం కానవస్తుంది. భాగస్వామ్యు మధ్య నూతన ఆలోచనలు స్పురిస్తాయి. వస్తువులు కొనుగోలుకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటినుంచో కలవాలనుకున్న ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది.
 
మకరం: సోదరీసోదరులు, సన్నిహితులకు సంబంధించి ఖర్చులు అధికం. స్త్రీల అజాగ్రత్త వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లే మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కుంభం: స్త్రీలు ఇంటికి కావలసిన విలువైన వస్తువులు సేకరిస్తారు. దూరంలోవున్న బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది. బ్యాంకింగ్ రంగాలవారికి మెళకువ అవసరం. క్రయవిక్రయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీవారు, శ్రీమతి మధ్య గతంలో ఏర్పడిన అభిప్రాయబేధాలు తొలగిపోతాయి. 
 
మీనం: కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చుచేస్తారు. మీ అశ్రద్ధ, ఆలస్యం వలన కొన్ని సమస్యలు తలెత్తుతాయి. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్ధతతో ఎదుర్కుంటారు. సానుకూలమైన మార్పుతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments