Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-02-2019 బుధవారం దినఫలాలు - ఆ రాశివారికి అపశకునాలు...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (09:28 IST)
మేషం: మీ సంతానం కోసం ధనం వ్యయం చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతే సంతృప్తినిస్తుంది. ఓర్పుతో వ్యవహరించడం వలన ఒక సమస్య పరిష్కారమవుతుంది. మీ శక్తి సామర్ధ్యాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తాయి. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. తలపెట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు.
 
వృషభం: విదేశీయానాలకై చేయు యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించడం క్షేమదాయకం. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం.
 
మిధునం: మీ కళత్ర పట్టుదల, సంతానం మొండివైఖరి వలన చికాకులు తప్పవు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రుణ యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు.
 
కర్కాటకం: ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాలు గురించి ఒక అవగాహనకు వస్తారు. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
సింహం: విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. పాతమిత్రుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది.
 
కన్య: పెద్దల సలహాను పాటింటి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మందలింపులు తప్పవు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. ఊహించని పెద్ద ఖర్చు తగిలే అవకాశం ఉంది.
 
తుల: విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి ఆప్యాయతలు పెరుగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ సంతానం విద్యా విషయాలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
 
వృశ్చికం: స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు షాపింగ్‌లోను, అపరిచిత వ్యక్తుల విషయంలోను జాగ్రత్తగా ఉండాలి. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి, ఆడిటర్లకు ఒత్తిడి పనిభారం అధికమవుతుంది.
 
ధనస్సు: పారిశ్రామిక రంగాలవారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.
 
మకరం: అత్యవసరమైన సమయంలో కావలసిన పత్రాలు కనిపించకుపోవచ్చు. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. తలపెట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఒకానొక విషయంలో మిత్రుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు.
 
కుంభం: విదేశీ యత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వాతావరణంలో మార్పు వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. నిరుద్యోగులు గడిచిన కాలం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకండి.
 
మీనం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేసుకోవలసివస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడికో ప్రియాంక కేసు.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు : హోం మంత్రి అనిత

వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక పరిణామం : సెక్షన్లు మార్చనున్న పోలీసులు

జెన్ జీ మన పిల్లలే ... పిల్లల భవిష్యత్ కంటే మంత్రి పదవి ముఖ్యం కాదు : ధర్మేంద్ర ప్రధాన్

జగన్ శిష్యులం... ఆయన కోసం ఎంతకైనా తెగిస్తాం : వైకాపా నేత చింతాడ

సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారు.. మనస్తాపంతో బలవన్మరణం

అన్నీ చూడండి

లేటెస్ట్

09 ఆగస్టు 2026 ఆదివారం: తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయి?

09-08-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

09-08-2026 నుంచి 15-08-2026 వరకు వార ఫలితాలు నేడు సాధ్యం కానిది రేపు...?

08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?

08-08-2026 శనివారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

తర్వాతి కథనం
Show comments