Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం (20-06-2018) దినఫలాలు - పుణ్యకార్యాల్లో చురుకుగా...

మేషం: కంప్యూటర్, ఇన్‌‌వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ప్రయాణాలు ఆశించిన ఫలితం ఉంటుంది. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళ

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (08:08 IST)
మేషం: కంప్యూటర్, ఇన్‌‌వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ప్రయాణాలు ఆశించిన ఫలితం ఉంటుంది. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. ఏదైనా స్థిరాస్తి అమ్మాకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది.
 
వృషభం: కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడుతాయి. స్త్రీల రచనలకు, కళాత్మతకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్తరప్రత్యుత్తరాలు ఆశించినంత సంతృప్తికరంగా సాగవు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
మిధునం: విద్యుత్, ఎ.సి.కూలర్ మెకానికల్ రంగాలవారికి సంతృప్తి కానవస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు సంపాదన, ఉద్యోగం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. రుణాలు తీర్చటానికై చేయు యత్నాలు ఫలిస్తాయి.  
 
కర్కాటకం: బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు.
 
సింహం: వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తగదు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినినిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
కన్య: కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి ఏదో విధంగా సర్దుబాటు కాగలదు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రావలసిన ధనం వసూలుకై అధిక శ్రమతప్పదు. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. 
 
తుల: లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. ఖర్చులు రాబడికి తగినట్లుగా ఉంటాయి. స్త్రీల మాటకు ఆదరణ, సంఘంలో గౌరవం లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. 
 
వృశ్చికం: మీ అవసరాలకు కావలసిన ధనం అందుతుంది. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. రిటైర్ ఉద్యోగస్తులకు సాదరవీడ్కోలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. 
 
ధనస్సు: కీలకమైన వ్యవహారాలు ఇరకాటంలో పడవేస్తాయి. పాత బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. రాబడికి మించిన ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్యటం మంచిది కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ వహించండి.
 
మకరం: పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. మీ ఆశయ సాధనకు ఉన్నతస్థాయి వ్యక్తులు సహకారం లభిస్తుంది. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. రాజకీయ కళారంగాలవారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి.
 
కుంభం: వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు ముచ్చటిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. ధనసహాయం, హామీల విషయంలో పునరాలోచన అవసరం. 
 
మీనం: కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి ఏదో విధంగా సర్దుబాటు కాగలదు. మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. మీ బంధువుల పరపతి మీకే విధంగానూ ఉపయోగపడదు. ప్రముఖులను కలుసుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పసిబిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే పల్లవి.. ఓవరాక్షన్ అంటూ ట్రోల్స్..

మరణశయ్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?!!: పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం

వల్లభనేని వంశీని జగన్ పక్కనబెడుతున్నారా? ఏంటి సంగతి?

శభాష్ ఝార్ఖండ్ స్టూడెంట్స్, ఎవరినీ అవమానించకుండా సాధించారు: కంగనా రనౌత్

పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంని చేయడమే లక్ష్యం: కుండబద్ధలు కొట్టిన పంతం నానాజీ

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు

తర్వాతి కథనం
Show comments