Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-02-2019 - శుక్రవారం మీ రాశిఫలితాలు - ఉద్యోగస్తులకు అనుకోని ప్రయాణాలు...

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (09:51 IST)
మేషం: వైద్య, ఇంజనీరింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ ఆలోచనకూ, ఆచరణకూ మధ్యనుండే ఎడం తగ్గించుకోవాలి. చేపట్టిన పనులు ముగింపు దశలో ఆసక్తి ఉండదు. పెద్దల ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయరాదు. మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. 
 
వృషభం: స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పత్రికా, మీడియా సంస్థల వారి అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఫైనాన్స్, చిట్స్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపుల లభిస్తుంది.
 
మిధునం: వ్యాపారవేత్తలు ప్రస్తుత పరిస్థితిని కొనుసాగనివ్వడం మంచిది. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. స్త్రీలకు పరిచయాలు, ఇతర వ్యాపకాలు అధికం కావడంతో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. షాపు గుమస్తాలు, పనివారలను ఓ కంట కనిపెట్టండి. బ్యాంకు పనులు అనుకూలం. 
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు అనుకోని ప్రయాణాలు ఎదురుకావొచ్చు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికమవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు.
 
సింహం: బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తుల వలన ఇబ్బందులు తప్పవు. మీ శ్రీమతితో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోవారికి సదవకాశాలు లభిస్తాయి. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కన్య: భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. బాకీలు, ఇంటి అద్దెల వసూళ్ళల్లో సౌమ్యంగా మెలగాలి.  
 
తుల: ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. సన్నిహితులకు మీరిచ్చిన సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయరంగాలలో వారికి అభిప్రాయ బేధాలు తలెత్తవచ్చు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. 
 
ధనస్సు: రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల్లోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలు ఇతరులతో సంభాషించేటపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం.  
 
మకరం: కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించవలసివస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
కుంభం: కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. బ్యాంకింగ్ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. 
 
మీనం: ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. విద్యార్థినులలో మానసికధైర్యం, సంతృప్తి చోటు చేసుకుంటాయి. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments