Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-06-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే...

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (05:00 IST)
మేషం : నోటీసులు, రశీదులు అందుకుంటారు. విద్యార్థినులు, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. క్రయ, విక్రయాల్లో మెలకువ వహించండి. 
 
వృషభం : స్త్రీలకు ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మొక్కుబడులు, దైవ కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంపుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. 
 
మిథునం : స్త్రీల మాటకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కర్కాటకం : నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. వృత్తిపరమైన బాధ్యతలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
సింహం : మీ అవకరాలకు కావలసిన ధనం సమయానికి ఏదో విధంగా సర్దుబాటు కాగలదు. మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. మీ బంధువుల పరపతి మీకేవిధంగానూ ఉపయోగపడదు. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. 
 
కన్య : సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన ధనం వసూలులో కొంత మొత్తం వసూలు కాగలదు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, సునిశిత పరిశీలన ముఖ్యం. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. 
 
తుల : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల వ్యామోహం అధికం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహరాలు, వాయిదాపడటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృశ్చికం : ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ కార్యక్రమాలకు మందకొడిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. 
 
ధనస్సు : చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. స్త్రీలు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అపరిచిత వ్యక్తులు మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
మకరం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెలకు అవసరం. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టరులు అనుకూలిస్తాయి. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. ఖర్చులు రాబడికి తగినట్టుగా ఉంటాయి. స్త్రీల మాటకు ఆదరణ, సంఘంలో గౌరవం లభిస్తాయి. 
 
కుంభం : రుణాలు తీర్చి తాకట్టులు విడిపించుకుంటారు. మిత్రుల వల్ల మీ కార్యక్రమాలు వాయిదాపడతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కవి, పండితులకు, కళాకారులకు సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
మీనం : కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రతి వ్యవహారంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. చేతి వృత్తుల వారికి ఆశాజనకం. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

అన్నీ చూడండి

లేటెస్ట్

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

తర్వాతి కథనం
Show comments