Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-12-2018 ఆదివారం దినఫలాలు - విందులు వినోదాల్లో మితంగా...

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (10:04 IST)
మేషం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
వృషభం: కుటుంబ సభ్యుల కోసం ధనం బాగుగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచడం మంచిది. దూరప్రయాణాలు చికాకు కలిగిస్తాయి.  
 
మిధునం: వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. రాజకీయనాయకులు విందులు వినోదాల్లో మితంగా ఉండాలి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపండుకుంటాయి.  
 
కర్కాటకం: వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సోదరీసోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విజ్ఞతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు.  
 
సింహం: ప్రింటింగ్ రంగాల వారికి బకాల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెరిగన ధరలు చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారపు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. 
 
కన్య: సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వలన ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ వ్యవహారాలు మీ మాట ప్రకారమే సాగుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.   
 
తుల: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనా శ్రద్ధ వహించండి. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మిత్రుల కలయికతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
వృశ్చికం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వలన ఒకింత ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమ అధికం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. 
 
ధనస్సు: దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. బంధువుల రాకతో ఊహించిన ఖర్చులే ఉంటాయి. దూరప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.  
 
మకరం: ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందుతారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆలయ సందర్శనాలలో చిన్నచిన్న చికాకులను ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు.    
 
కుంభం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం గురించి ఆందోలన చెందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.   
 
మీనం: బంధువులతో సంబంధ బాంధవ్యాలు బలపడుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవుత. మీరు చేయు యత్నాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు లుండవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments