Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం (25-06-2018) దినఫలాలు - తొందరపడి నిర్ణయాలు..

మేషం: ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. దూరప్రయాణాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ కళత్రమ మెుండివైఖరి మీకు ఎంతోచికాకు కలిగిస్తుంది. రుణాలు తీర్చడంతో పాటు తాకట్టు వస్తువులను విడి

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (08:44 IST)
మేషం: ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. దూరప్రయాణాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ కళత్రమ మెుండివైఖరి మీకు ఎంతోచికాకు కలిగిస్తుంది. రుణాలు తీర్చడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపిస్తారు. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్థానాలు చేయడం వలన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
వృషభం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ఉమ్మడి వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ వహించండి. 
 
మిధునం: శారీరక శ్రమ, అకాల భోజనం వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోనివారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కర్కాటకం: మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలే జరుగుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. 
 
సింహం: దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు ముచ్చటిస్తారు. ధనసహాయం, హామీల విషయంలో పునరారోచన అవసరం. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. రాజకీయ కళా రంగాలవారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి.  
 
కన్య: నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. శత్రువులపై విజయం సాధిస్తారు. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
తుల: మీ కళత్రమెుండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరంచేస్తాయి. బ్యాంగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. క్రీడలపట్ల నూతన ఉత్సాహం కానవస్తుంది. ఖర్చులు పెద్దగా లేకున్నా ధనవ్యయం, ధనసహాయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏజెంట్కు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
వృశ్చికం: ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమం. వైద్యులకు శస్త్రచికిత్సలు నిర్వహించునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
ధనస్సు: ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనులు ఆశించినంత చురుకుగా సాగవు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో సంతృప్తినిస్తుంది. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి.
 
మకరం: స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మెుండివైఖరి మీకు చికాకులు కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
కుంభం: వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సత్ఫలితాలు పొందుతారు. మీ లక్ష్యసాధనకు బాగా కష్టపడాలి. స్త్రీలు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కవి, పండితులకు, కళాకారులకు సంఘంలో ఆదరణ లభిస్తుంది. అపరిచిత వ్యక్తులు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. 
 
మీనం: ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి వ్యవహారంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. తొందరపడి వాగ్థానాలు చేయడం వలన ఇబ్బందులు తప్పవు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, ఆందోళన తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

తర్వాతి కథనం
Show comments