Webdunia - Bharat's app for daily news and videos

Install App

29-01-2019 మంగళవారం దినఫలాలు : రుణ విముక్తులు... బ్రోకర్లకు శ్రమాధిక్యత...

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (08:33 IST)
మేషం: ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలం సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు టి.వి. ఛానల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల కలయిక వలన మేలు జరుగుతుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ప్రియతముల కోసం, సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
వృషభం: ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మీ సంతానం మొండి వైఖరి వలన చికాకులు తప్పవు. ఓటమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. అతిధి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. 
 
మిధునం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి చికాకులను ఎదుర్కుంటారు. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. మీపై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఇంట్లో మార్పులు, పట్టుదల ఎంతో ముఖ్యమన గమనించండి. మ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమవుతోందని గమనించండి. 
 
కర్కాటకం: ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణ విముక్తులు కావడంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి. హోటలు, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. పరస్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరులు మిమ్మల్ని చూసి అపోహపడే ఆస్కారం ఉంది.  
 
సింహం: ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. పాతబాకీలు వసూలు చేయడం వలన ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
కన్య: ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు, కాంపౌండర్లు, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతంగా ఉండదు. ఉద్యోగస్తులకు తోటివారిని విమర్శించడం వలన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం.  
 
తుల: కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయల వ్యాపారులు పురోభివృద్ధి పొందుతారు. ఇతరులకు సహాయం అర్థించడం వలన మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
వృశ్చికం: రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. దైవ కార్యాల పట్ల శ్రద్ధ వహిస్తారు. నూతన వాతావరణం, కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కాంట్రాక్టురలు, అగ్రిమెంటులు, ప్రయాణాలు వ్యాపార లావాదేవీలపై శ్రద్ధ చూపుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది.  
 
ధనస్సు: విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పవు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు. కోర్టు పనులు వాయిదా పడడం మంచిదని గమనించండి. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. 
 
మకరం: వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. గృహ నిర్మాణాలకు కావలసిన బ్యాంకు లోన్లు మంజూరు కాగలవు. మీ ఏమరుపాటు వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెండింగ్ పనులు పూర్తికాకపోవడంతో ఉద్యోగస్తులు అధికారులతో మాటపడక తప్పదు.    
 
కుంభం: రావలసిన మొండి బాకీలు ఆలస్యమైనకానీ వసూలవుతాయి. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. పత్రికా రంగాలలోని వారికి నిరుత్సాహం తగదు.   
 
మీనం: సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడం వలన విభేదాలు తలెత్తవచ్చు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలు వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ధాన్యము, కలప, పేపరు, యాంత్రిక వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరణశయ్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?!!: పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం

వల్లభనేని వంశీని జగన్ పక్కనబెడుతున్నారా? ఏంటి సంగతి?

శభాష్ ఝార్ఖండ్ స్టూడెంట్స్, ఎవరినీ అవమానించకుండా సాధించారు: కంగనా రనౌత్

పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంని చేయడమే లక్ష్యం: కుండబద్ధలు కొట్టిన పంతం నానాజీ

ఏఈ ఫ్యామిలీ కేసు.. షేక్ సాధిక్‌పై నూకరాజు వియ్యంకుడు కేసు.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు

తర్వాతి కథనం
Show comments