Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం (02-04-18) దినఫలాలు - శివుని ఆరాధించిన శుభం

మేషం : వాణిజ్య ఒప్పందాలు, వ్యవహారాలు వాయిదా వేయడం ఉత్తమం. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్‌లు పొందుతారు. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ధనం మితంగా ఖర్చు చేయండి. ప్రముఖ

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (08:34 IST)
మేషం : వాణిజ్య ఒప్పందాలు, వ్యవహారాలు వాయిదా వేయడం ఉత్తమం. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్‌లు పొందుతారు. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ధనం మితంగా ఖర్చు చేయండి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : రాజకీయాల వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వైద్యులకు లాభదాయకం. లాయర్లకు చికాకులు తప్పవు. ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మిథునం : మధ్యవర్తిత్వం వహించుట వల్ల మాటపడక తప్పదు. ముఖ్యుల సలహాను పాటించండి. భాగస్వామిక వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. పెరిగిన కుటుంబ అవసరాలు, రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం : బంధువుల తోడ్పాటుతో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
సింహం : వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అనుకోని ఖర్చులు అధికమవుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన పనులలో విజయం చేకూరుతుంది. 
 
కన్య : విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఎసీ కూలర్ మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
తుల : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తప్పవు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశాజనకం. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. సేవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం : విద్యార్థులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. విదేశాలు వెళ్లడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఉద్యోగంలో పైఅధికారుల ప్రశంసలు పొందుతారు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. 
 
ధనస్సు : వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మొండి బకాయిలు సైతం వసూలు కాగలవు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ సంతానం మొండివైఖరి వల్ల స్వల్ప చికాకు లెదుర్కొంటారు. సాహిత్యాభిలాష పెరుగుతుంది. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్య తెచ్చుకోకండి. 
 
మకరం : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. 
 
కుంభం : బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కోర్టు పనులు వాయిదా పడుట మంచిది. పాత బాకీలు వసూలవుతాయి. ఆత్మీయుల కలయికతో స్త్రీలు మానసికంగా కుదుటపడతారు. 
 
మీనం : ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. స్త్రీలకు సంతానం, పనివారలతో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆవకాశం ఉంది. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments