శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 04-09-17

మేషం : ఈ రోజు ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొంటారు. వైద్

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (12:35 IST)
మేషం : ఈ రోజు ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొంటారు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. సంఘంలో గౌరవం లభిస్తుంది. 
 
వృషభం : ఈ రోజు హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయం సాధిస్తారు. వాహనచోదకులకు ఊహించిన చికాకులు అధికమవుతాయి. టీవీ, రేడియో రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. 
 
మిథునం : ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. రాజకీయ నేతలకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇతర విషయాలపై ఆసక్తిని తగ్గించి, స్వవిషయాలపై శ్రద్ధ పెడితే మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. 
 
కర్కాటకం : ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన మార్పులుంటాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికు, పథకాలు సత్ఫలితాలనివ్వగలవు. సమయానికి సహకరించని మిత్రుల వల్ల ఒకింత ఇబ్బందులెదుర్కొంటారు. మొండి బకాయిలు వసూలు కాగలవు. స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం విరమించుకోవడం మంచిది. 
 
సింహం : ఈ రోజు ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. స్త్రీలు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాట పడవలసి వస్తుంది. 
 
కన్య : ఈ రోజు ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహంలో ఏదైనా వస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 
 
తులం : ఈ రోజు ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. ఇతర కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. రావలసిన ధనం ఆలస్యంగా చేతికందుతుంది. 
 
వృశ్చికం : ఈ రోజు ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ప్రముఖులు అయిన వారిని కలుసుకుంటారు. మీ యత్నాల్లో పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. స్థమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. 
 
ధనస్సు : ఈ రోజు వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబీకులను పట్టించుకునేందుకు క్షణం తీరిక ఉండదు. ఒక వ్యవహారం నిమిత్తం ఫ్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మకరం : ఈ రోజు రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రవాణా రంగాల వారికి ఇబ్బందులు అధికమవుతాయి. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. 
 
కుంభం : ఈ రోజు పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చులు వల్ల ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగస్తులు శ్రమను అధికారులు గుర్తిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. 
 
మీనం : ఈ రోజు పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కోక తప్పదు. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి కానవస్తుంది. బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. సిమెంట్, కలప, ఐరెన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ రాజు

మద్యం తాగొద్దన్న తల్లి - చంపేసిన కుమార్తె.. ఎక్కడ?

వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?

భోజ్‌పూర్‌లో యువకుడు ఎన్‌కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు

సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?

అన్నీ చూడండి

లేటెస్ట్

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

తర్వాతి కథనం
Show comments