Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు(05-06-2017)... దూరమైన వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు..

భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం, చికాకులను ఎదుర్కొంటారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విజయం సాధించిన రోజు దూరమైన వారు తప్పక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తార

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (18:06 IST)
మేషం : బ్యాంకు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు తావివ్వవద్దు. తల, నరాలు, ఎముకలకి సంబధించిన చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కోసం వేచియుండక తప్పదు. స్త్రీలకు అకాల భోజనం వల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి.
 
వృషభం : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమౌతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం, మనోధైర్యంతో ఎంతటి కార్యానైనా సాధించగలుగుతారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగును. 
 
మిథునం: రాజకీయాల్లోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. 
 
కర్కాటకం:  మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ పనుల్లో అప్రమత్తంగా మెలగండి. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భాల్లో ధననష్టము సంభవించును. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. 
 
సింహం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు కొత్త వాతావరణం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు చికాకులను ఎదుర్కొంటారు. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. 
 
కన్య: కుటుంబంలో ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యుల రాకపోకలు, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. 
 
తుల : దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. స్త్రీలకు మిత్రులధోరణి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికం.
 
వృశ్చికం : భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం, చికాకులను ఎదుర్కొంటారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విజయం సాధించిన రోజు దూరమైన వారు తప్పక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. పీచు ఫోం, లెదర్, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
ధనస్సు : విద్యుత్, ఏసీ కూలర్ మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. సాహిత్య రంగాల్లోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఫ్యాన్సీ, వస్తు, వస్త్ర వ్యాపారస్తులకు చికాకు తప్పదు. ఇతరుల సలహా కంటే  సొంత నిర్ణయాలే మేలు.
 
మకరం : స్త్రీలకు సంపాదన, ఉద్యోగం పట్ల ఆసక్తి ఏర్పడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. పెద్దలు అయిన వారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
కుంభం : గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాల్లో వారు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. నరాలు, తల, ఎముకలకి సంబంధించి సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. 
 
మీనం : సన్నిహితులతో కలిసి సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. తొందరపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. విలువైన పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వాహన చోదకులకు మెళకువ అవసరం. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పెద్దలతో వాదోపవాదాలకు దిగవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

అన్నీ చూడండి

లేటెస్ట్

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తర్వాతి కథనం
Show comments