Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (12:49 IST)
Gemini
2025లో మిథునరాశి వారి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే.. 2025 మొదటి అర్ధభాగం మిథునరాశి వ్యక్తులకు ఉద్యోగ రంగంలో అనుకూలమైన అవకాశాలను తెస్తుంది. వ్యాపార రంగంలోని 2025 ద్వితీయార్ధంలో గణనీయమైన ఫలితాలను చూడవచ్చు. అలాగే రాశికి 10వ ఇంట్లో రాహువు సంచరించడం వల్ల మీ కుటుంబానికి, ఉద్యోగ స్థానానికి గుర్తింపు లభిస్తుంది. ప్రధాన గ్రహాల స్థానాలన్నీ మీ వృత్తి జీవితానికి అనుకూలంగా ఉంటాయి.
 
ఉద్యోగ రంగంలోని మిథునరాశి జాతకులకు 2025 అన్ని విధాలా కలిసివస్తుంది. లక్ష్యాలు నెరవేరుతాయి. వృత్తిపరమైన లక్ష్యాల వైపు గొప్ప పురోగతిని సాధించవచ్చు. ఉద్యోగస్థులు తమ కెరీర్ పురోగతి కోసం నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, మరింత శ్రద్ధగా పని చేయడం ప్రారంభించేందుకు ఇది మంచి సమయం.
 
వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. టెక్, సాఫ్ట్‌వేర్ రంగాలలో వుండే మిథునరాశి జాతకులు, కళాకారులు, రాజకీయ నాయకులు కెరీర్ పరంగా అద్భుతమైన వృద్ధిని గుర్తింపును పొందుతారు. 
 
2025 సంవత్సరం ద్వితీయార్ధం ప్రమోషన్, ఇంక్రిమెంట్‌ లభించే అవకాశం వుంది. మీ కష్టం ఫలిస్తుంది. మీ ప్రతిష్టను ఏ శత్రువు లేదా పోటీదారు నాశనం చేయలేరు. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అయితే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. వచ్చే ఏడాది కెరీర్‌తో సంతృప్తి చెందుతారు.
 
వ్యాపార రంగంలోని మిథునరాశి వారికి ఈ సంవత్సరం ఎలా వుండబోతుందంటే.. వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పవు. ప్రయత్నాలన్నీ ఫలించలేదని మీరు భావించవచ్చు, కానీ ఇది కేవలం కొన్ని రోజులేనని గమనించండి. ఈ సంవత్సరం ప్రథమార్థం వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. ఎగుమతులు పెరుగుతాయి. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. 
 
2025 సంవత్సరం మొదటి అర్ధభాగంలో చేసిన వాణిజ్యానికి సంబంధించిన చెల్లింపులు ద్వితీయార్థంలో మీకు చేరవచ్చు. సంవత్సరం గడిచేకొద్దీ, మీ జాతకంలోని 1వ ఇంట్లో బృహస్పతి సంచారం, మీ 10వ ఇంట్లో శని సంచారం, మీ 9వ ఇంట్లో రాహువు సంచరించడం వల్ల మీరు అపారమైన ఫలితాలు, లాభాలను చూడటం ప్రారంభిస్తారు.
 
మిథునం కెరీర్ జ్యోతిష్యం 2025 ప్రకారం, వ్యాపారంలో వేగం పుంజుకుంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలోని పోటీదారులు మీ క్లయింట్‌లలో మీ కీర్తిని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. కానీ స్థిరమైన లాభాలుంటాయి.
 
మీ ఖాతాదారుల సంఖ్య కూడా పెరగవచ్చు. కొన్ని అడ్డంకులు ఉంటాయి. కానీ మీ కృషి, పట్టుదలతో, ఎటువంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి. విదేశీ వ్యాపారాలు అధిక లాభాలను పొందుతాయి. అలాగే, ఆటోమొబైల్స్, టెక్నికల్ వర్క్, ఎరువులు, రసాయనాలు, గనులు, విలాసవంతమైన వస్తువులు, మద్యానికి సంబంధించిన వ్యాపారాలు లాభాలను ఆర్జించి పెడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments