Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం అష్టమి... కాల భైరవుడిని ఏ రాశి వారు పూజించాలి..?

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (22:28 IST)
కాల భైరవుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఆదివారాల్లో రాహుకాలం సందర్భంగా భైరవుడికి అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహించి గారెలతో చేసిన మాలను సమర్పిస్తే వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. 
 
అప్పులు తీసుకొని వడ్డీలు చెల్లించి ఇబ్బందులు పడుతున్న వారు రాహుకాలం సందర్భంగా కాలభైరవుడికి జీడిపప్పులతో మాలను సమర్పించి, పొంగలిని నైవేద్యంగా సమర్పించడం మంచిది. 
 
సోమవారాల్లో శివునికి ప్రీతిపాత్రమైన విల్వతో అర్చన చేసి, భైరవుడిని పూజిస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి. సోమవారాలు లేదా సంకటహర చతుర్థి రోజున భైరవుడికి పన్నీరు అభిషేకం చేయిస్తే.. కంటి వ్యాధులు నయం అవుతాయి. కర్కాటక రాశి వారు ఈ వారాలలో పూజించవచ్చు.
 
భైరవుడిని ఆరాధించడం వల్ల అనుకోకుండా కోల్పోయిన వస్తువును తిరిగి పొందడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మంగళవారం సాయంత్రం మిరియాల దీపం వెలిగించి పూజిస్తే పోగొట్టుకున్న వస్తువు తిరిగి వస్తుంది. మేష రాశి, వృశ్చిక రాశి వారు భైరవుడిని ఆరాధించడానికి మంగళవారం ఉత్తమమైన రోజు. ముఖ్యంగా అష్టమి తిథి నాడు భైరవ పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
మంగళవారం అష్టమి తిథి రావడం చాలా మంచిది. శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాడు ఎరుపు రంగు పువ్వులతో భైరవుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే కాలభైరవునికి బుధవారాల్లో, నెయ్యి దీపాలు వెలిగించడం ద్వారా ఇల్లు, భూమిని కొనుగోలు చేసే యోగాన్ని పొందుతారు. మిథునం, కన్యారాశి ప్రజలు ఈ రోజున భైరవుడిని పూజించాలి.
 
గురువారం నాడు భైరవుడికి దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు, మీన రాశి వారికి ఈ రోజున పూజ చేయడం ఉత్తమమైన రోజు. శుక్రవారం సాయంత్రం భైరవ మూర్తికి బిల్వ ఆకులతో అర్చన చేయడం ద్వారా అంతులేని సంపద లభిస్తుంది. వృషభం, తులారాశి ఆరాధనకు గురువారం ఉత్తమమైన రోజు. 
 
శనివారాల్లో కాలభైరవుడిని పూజించడం ద్వారా శనిదోషం తొలగిపోతుంది. మకరం, కుంభ రాశి ఈ రోజున ఆయనను పూజించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

తర్వాతి కథనం
Show comments