కార్తీక పౌర్ణమి నదుల వద్ద దీపారాధన చేస్తే...?

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (13:47 IST)
కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువుల వద్ద దీపాలను వెలిగించడం ద్వారా రుణ విముక్తులు అవుతారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువులు మొదలైన ప్రదేశాలలో దీపాలను వెలిగించడం ద్వారా అన్ని రకాల కష్టాలు తీరుతాయి. దీనితో పాటు కార్తీక పూర్ణిమ నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం తప్పనిసరిగా కట్టాలి. ప్రధాన ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి.
 
అలాగే కార్తీక మాసంలో తులసిని పూజిస్తే శాశ్వత ఫలం లభిస్తుంది. ఈ రోజున తీర్థపూజ, గంగాపూజ, విష్ణుపూజ, లక్ష్మీపూజ, యాగాలు నిర్వహిస్తారు. ఈ రోజున తులసి మాతను పూజించి, ఆమె ముందు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 
 
కార్తీక పూర్ణిమ రోజున ఉపవాసంతో పాటు గంగాస్నానానికి కూడా విశేష విశిష్టత ఉంది. అలాగే కార్తీక పూర్ణిమ నుండి ఒక సంవత్సరం పాటు పౌర్ణమి వ్రతం తీర్మానం చేసి ప్రతి పౌర్ణమి నాడు స్నానం చేయడం వంటి పుణ్యకార్యాలతోపాటు శ్రీ సత్యనారాయణ కథా శ్రవణం ఆచారం ఫలవంతమైనదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ముఖంలో భయం క్లియర్‌గా కనిపిస్తోంది.. బొద్దింకలకు ధన్యవాదాలు.. ప్రకాష్ రాజ్

July 25, 2026: జూలై 25, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

ఈ ప్రొటెస్ట్‌కి పోయేకాలం దగ్గర పడ్డది, జంతర్ మంతర్ నుంచి తెలుగు యువకుడు వీడియో

విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపు

Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు

TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌

తర్వాతి కథనం
Show comments