Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం నరసింహ స్వామి పూజ.. ఆవుపాలు, పానకాన్ని? (Video)

Webdunia
మంగళవారం, 12 మే 2020 (13:16 IST)
బుధవారం పూట నరసింహ స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలువుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మానవునికి ఈతిబాధలు ఎందుకొస్తాయనే అంశంపై భోజ మహారాజు తన గ్రంథం నీతిభూషణలో ఇలా పేర్కొనియున్నారు.

ఏ మనిషి పితృదేవతలను పూజించడో, స్తుతించడో అతని ఈతిబాధలు తప్పవని తెలిపాడు. ఇది కాకుండా దేవతలను నిందించడం, అన్యోన్యంగా వుండే దంపతులను విడదీయడం, కుటుంబంలో కలతలు సృష్టించడం.. నోరు లేని జీవాలను హింసించడం, పూర్వ జన్మల పాపాలు వెంటాడే కారణంగా మానవునికి ఈతిబాధలు వుంటాయి. 
 
అందుకే పూర్వ జన్మ పాపాలు తొలగించుకోవడం.. తెలిసీ తెలియని పాపాల నుంచి గట్టెక్కాలంటే.. మనం చేయాల్సిందల్లా శ్రీ నృసింహ స్వామిని పూజించాలి. పాపాలు తొలగిపోవాలంటే.. భక్తిని మించిన పరిహారం లేదు. పూర్తి విశ్వాసంతో.. నరసింహ స్వామిని శరణు కోరితే.. పాపాలు తొలగిపోవడం తద్వారా ఈతిబాధల నుంచి తప్పించుకోవడం వంటివి చేయొచ్చు. 
 
తూర్పు దిశలో ఇంట్లోని పూజగదిలో నరసింహ స్వామి పటాన్ని వుంచి పూజించాలి. రోజూ శుచిగా స్నానమాచరించి.. నరసింహ ప్రభక్తి శ్లోకాన్ని 3, 12, 24, 48 సార్లు పారాయణం చేయడం ద్వారా ఈతిబాధలుండవు.

ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి పటం ముందు దీపం వెలిగించి.. మరిగించి చల్లార్చిన ఆవు పాలను లేదా పానకాన్ని నైవేద్యం చేయాలి. ఈ ప్రసాదాన్ని కుటుంబంలోని అందరూ తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు నరసింహ స్వామిని ఆరాధించినట్లైతే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments